ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణి ప్రసవం.. పలువురు అభినందనలు..
ఈరోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు సామాన్యుడు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. వైద్యులు, సిబ్బంది సమయానికి ఉండరు. సరైన సౌకర్యాలు, వసతులు ఉండవు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారనే విమర్శలు ఉన్నాయి. అందులోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే.. అంతంత మాత్రమే.. అయినప్పటికీ ఇపుడు ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వయాన తన సతీమణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు.

ఈరోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు సామాన్యుడు వెళ్ళాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి. వైద్యులు, సిబ్బంది సమయానికి ఉండరు. సరైన సౌకర్యాలు, వసతులు ఉండవు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారనే విమర్శలు ఉన్నాయి. అందులోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీలో ప్రభుత్వ ఆసుపత్రులు అంటే.. అంతంత మాత్రమే.. అయినప్పటికీ ఇపుడు ఆ జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం కలిగించేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. స్వయాన తన సతీమణిని ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేయించారు. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. నలుగురికి ఆదర్శంగా నిలిచారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ సతీమణి ప్రభుత్వ ఆసుపత్రి లో డెలివరీ అయ్యింది. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా కలెక్టర్ సతీమణి శ్రద్ధ జీతేష్ వి పాటిల్.. తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. చాలకాలం గా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకుంటున్నారు కలెక్టర్ సతీమణి. ఈ క్రమంలోనే కాన్పు కోసం అదే ఆసుపత్రికి వచ్చారు. దీంతో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారు జిల్లా కలెక్టర్. కలెక్టర్ దంపతులను పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందించారు. జిల్లా పాలనలో తనదైన మార్క్ చూపిస్తూ.. ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. వసతులు, సౌకర్యాలు అందుతున్న తీరును స్వయంగా పరిశీలిస్తున్నారు కలెక్టర్. అలసత్వంగా ఉన్న సిబ్బందికి వార్నింగ్ కూడా ఇస్తున్నారు. తాజాగా ఇస్వయంగా కలెక్టర్ భార్య ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కావడంతో పేదలకు నమ్మకం కుదురుస్తున్నారు. పలువురికి ఆదర్శంగా నిలిచారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
