Viral Video: సర్పంచ్ కుర్చీనే కబ్జా చేసిన శునకం… కుర్చి దిగేందుకు ససేమిరా అంటున్న వీధి కుక్క
కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టితే ఎలా ఉంటుందో అనేది పక్కన పెడితే.. ఓ శునకం ఏకంగా ఆ గ్రామ సర్పంచ్ కుర్చీనే ఆక్రమించేసింది. అయ్యయ్యో... నువ్వు అక్కడ కూర్చోకూడదు.. దిగమని ఎంతచెప్పినా ఆ శునకం ఇంచ్ కూడా కదల్లేదు. సర్పంచ్ కుర్చీని వదిలేదే లేదంటున్న ఆ శునకాన్ని...

కుక్క తోక వంకర, కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చొపెట్టితే ఎలా ఉంటుందో అనే సామెతలు పక్కన పెడితే.. ఓ శునకం ఏకంగా ఆ గ్రామ సర్పంచ్ కుర్చీనే ఆక్రమించేసింది. అయ్యయ్యో… నువ్వు అక్కడ కూర్చోకూడదు.. దిగమని ఎంతచెప్పినా ఆ శునకం ఇంచ్ కూడా కదల్లేదు. సర్పంచ్ కుర్చీని వదిలేదే లేదంటున్న ఆ శునకాన్ని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు ఆ గ్రామపంచాయితీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని కడెం మండలం ధర్మాజీపేట్ గ్రామపంచాయతీ కార్యాలయాలనికి గత ప్రభుత్వ హాయంలో నూతన బిల్డింగ్ మంజూరు కావడంతో పాత కార్యాలయాన్ని కూల్చివేసి కొత్త భవనాన్ని నిర్మించేందుకు సిద్ధమయ్యారు. అప్పటి నుండి అద్దె భవనంలోనే గ్రామ పంచాయతీ కార్యాలయం నిర్వహిస్తున్నారు. ఉదయం పనిమీద పంచాయితీ కార్యాలయానికి వచ్చిన స్థానికులకు షాకింగ్ సీన్ కనిపించింది.
సర్పంచ్ చైర్‌లో ఓ శునకం పడుకొని ఉండటం చూసి అంతా షాకయ్యారు. ఆ కుక్కను కుర్చీనుంచి దించేందుకు ఎంత ప్రయత్నించినా ఆ శునకం ససేమిరా అంటూ కుర్చీలోనుంచి దిగలేదు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు కుక్క ను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఓ వ్యక్తి ఆ దృశ్యాన్ని వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది.
