Bathukamma: దేశ రాజధాని ఢిల్లీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. తొలిసారిగా కేంద్రం ఆధ్వర్యంలో..

తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. మొదటిసారిగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.

Bathukamma: దేశ రాజధాని ఢిల్లీలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు.. తొలిసారిగా కేంద్రం ఆధ్వర్యంలో..
Bathukamma Celebrations In
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 28, 2022 | 5:58 AM

తెలంగాణ పూల పండుగ బతుకమ్మకు అరుదైన గౌరవం దక్కింది. మొదటిసారిగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇండియా గేట్‌, కర్తవ్యపథ్ ముందు మంగళవారం నిర్వహించిన ఈ వేడుకల్లో కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, మీనాక్షిలేఖీ, సహాయ మంత్రి అజయ్ భట్ పాల్గొన్నారు. ఈ సంబురానికి ఢిల్లీలోని తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కిషన్‌రెడ్డి సతీమణి కావ్య, జీవిత రాజశేఖర్, హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పలువురు మహిళలు బతుకమ్మ ఆడిపాడారు.

తెలంగాణ విమోచన వేడుకల్లో భాగంగా ఢిల్లీలో తొలిసారి బతుకమ్మ వేడుకలు నిర్వహించినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. నిజాం పాలనలో రజాకార్లు ఆడబిడ్డలను అవమానపరిచారని, ఆ గుర్తులను దూరం చేసుకుంటూ వేడుకలను నిర్వహించామన్నారు.

ఇవి కూడా చదవండి

స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

మరోవైపు ఢిల్లీ బతుకమ్మ వేడుకలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తెలంగాణ వచ్చిన 8 ఏళ్ల తర్వాత బీజేపీకి బుద్ధి వచ్చిందని విమర్శించారు. గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర బతుకమ్మ ఆడుతున్నారంటే అదంతా కేసీఆర్‌ గొప్పతనమేనని కవిత పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..