Batukamma: నేడే సద్దుల బతుకమ్మ.. వరంగల్‌లో ఎన్నికల ఎఫెక్ట్.. అయోమయంలో దసరా సంబరాలు

|

Oct 22, 2023 | 8:07 AM

సద్దుల బతుకమ్మపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. వరంగల్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు. దీంతో వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ సంబరాలకు బ్రేక్ పడింది.

Batukamma: నేడే సద్దుల బతుకమ్మ.. వరంగల్‌లో ఎన్నికల ఎఫెక్ట్.. అయోమయంలో దసరా సంబరాలు
Bathukamma 2023
Follow us on

ఓ వైపు తెలంగాణాలో ఎన్నికల సందడి మొదలైంది. మరోవైపు ఊరూ వాడా పూల వనంగా మారాయి. నేడు దుర్గాష్టమి.. బతుకమ్మ తోయిందో రోజున సద్దుల బతుకమ్మ.. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి సద్దుల బతుకమ్మ ఆడతారు. సద్దుల బతుకమ్మకు నేటి సాయంత్రం ముగింపు పలుకుతారు. సద్దుల బతుకమ్మ రోజున సత్తుపిండి, పెరుగన్నం, పులిహోర, మలీద ముద్దలు, కొబ్బరన్నం, నువ్వులన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ మీద కొలువైన గౌరమ్మను  గంగమ్మ ఒడికి చేర్చి ఏడాది వరకు బతుకమ్మ కోసం ఎదురుచూస్తారు.

అయితే సద్దుల బతుకమ్మపై ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ పడింది. వరంగల్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలకు ఏర్పాట్లు చేయలేమని అధికారులు చేతులెత్తేశారు. రంగలీల మైదానంలో కార్యక్రమాల నిర్వహణకు నిధులు ఇవ్వలేమని జీడబ్ల్యూఎంసీ అధికారులు తేల్చేశారు. దీంతో వరంగల్ కార్పొరేషన్ పరిధిలో సామూహిక సద్దుల బతుకమ్మ సంబరాలకు బ్రేక్ పడింది. తెలంగాణ ప్రతిష్టాత్మక పండగ సంబరాలపై ఎన్నికల కోడ్‌ ఎఫెక్ట్‌ పడటంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అటూ ఉత్సవ కమిటీలు గందరగోళంలో పడ్డాయి. ప్రభుత్వ అధికారుల చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు విశ్వాహిందూ పరిషత్‌ సభ్యులు… సీఈఓ వికాస్‌ రాజ్‌ను కలిసి బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..