AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేను మీలో ఒకడ్నే..రోడ్డు పక్కన హోటల్‌లో ఎమ్మెల్యే లంచ్

ఎమ్మెల్యే…అందులోనూ అధికార పార్టీ. ఇంక దర్పం  ఏ రేంజ్‌లో ఉంటుంది. చుట్టూ అనుచరుల హంగామా..ఎక్కడకు వెళ్లినా వెంటనడిచే కార్యకర్తలు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం అత్యంత సాదాసీదాగా సామాన్యుడి తరహాలో ఓ హోటల్లో లంచ్ చేశారు. ఆయనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. మంగళవారం పనుల నిమిత్తం మంచిర్యాల మీదుగా వెళ్తుండగా.. అప్పటికే భోజన సమయం కావడంతో బెల్లంపల్లి చౌరస్తాలో కారును ఆపారు. సమీపంలోని ఓ హోటల్లోకి వెళ్లి సాధారణ వ్యక్తిలా గన్‌మెన్‌లతో కలిసి భోజనం చేశారు. […]

నేను మీలో ఒకడ్నే..రోడ్డు పక్కన హోటల్‌లో ఎమ్మెల్యే లంచ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 27, 2019 | 12:15 AM

ఎమ్మెల్యే…అందులోనూ అధికార పార్టీ. ఇంక దర్పం  ఏ రేంజ్‌లో ఉంటుంది. చుట్టూ అనుచరుల హంగామా..ఎక్కడకు వెళ్లినా వెంటనడిచే కార్యకర్తలు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం అత్యంత సాదాసీదాగా సామాన్యుడి తరహాలో ఓ హోటల్లో లంచ్ చేశారు. ఆయనే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు. మంగళవారం పనుల నిమిత్తం మంచిర్యాల మీదుగా వెళ్తుండగా.. అప్పటికే భోజన సమయం కావడంతో బెల్లంపల్లి చౌరస్తాలో కారును ఆపారు. సమీపంలోని ఓ హోటల్లోకి వెళ్లి సాధారణ వ్యక్తిలా గన్‌మెన్‌లతో కలిసి భోజనం చేశారు. ఎమ్మెల్యే హోటల్లో కనిపించడంతో ఆయన్ను గుర్తుపట్టినవారు ఆశ్చర్యపోయారు. తెలియనివారు ఆయన ఎమ్మెల్యే అని తెలుసుకుని షాక్ అయ్యారు.