Telangana: ఎన్నికలపై ఫోకస్‌ పెంచిన బీజేపీ.. తెలంగాణకు క్యూ కట్టనున్న జాతీయ నాయకులు..

త్వరలోనే ముఖ్య నాయకులు మొత్తం తెలంగాణపైన దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్‌ షా టూర్‌ కన్ఫామ్‌కాగా మిగతా నాయకులు ఎప్పుడెప్పుడు తెలంగాణ వస్తారన్న దానిపై షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న జాతీయ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా.. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు...

Telangana: ఎన్నికలపై ఫోకస్‌ పెంచిన బీజేపీ.. తెలంగాణకు క్యూ కట్టనున్న జాతీయ నాయకులు..
Bjp National Leaders
Follow us
Ashok Bheemanapalli

| Edited By: Narender Vaitla

Updated on: Nov 19, 2023 | 9:49 PM

తెలంగాణలో ఎన్నికల వేడు రాజుకుంటోంది. ఎలక్షన్స్‌కి సమయం దగ్గరపడుతోన్న తరుణంలో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ సైతం ఫోకస్‌ను పెంచింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఓవైపు లోకల్‌ నాయకత్వం ఇంటర్నల్‌ తన పని తను చేసుకోపోతుంటే దానికి తోడు జాతీయ నాయకత్వం కూడా ప్రచారంలో పాల్గొననుంది.

త్వరలోనే ముఖ్య నాయకులు మొత్తం తెలంగాణపైన దృష్టి సారించారు. ఇప్పటికే ప్రధాని మోదీ, అమిత్‌ షా టూర్‌ కన్ఫామ్‌ కాగా మిగతా నాయకులు ఎప్పుడెప్పుడు తెలంగాణ వస్తారన్న దానిపై షెడ్యూల్‌ విడుదలైంది. తెలంగాణలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న జాతీయ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా.. అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, రోడ్ షోలు, మీడియా సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇందులో భాగంగానే నవంబరు 19న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నవంబరు 25, 26వ తేదీన హుజురాబాద్ , మహేశ్వరంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నవంబరు 24, 25, 26న తెలంగాణకు రానున్నారు. అలాగే అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ తో పాటు, గోవా సీఎం ప్రమోద్ సావంత్‌లు తెలంగాణ పర్యటనలో భాగంగా రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు.

ఇక కేంద్రమంత్రి పీయూష్ గోయల్ 21వ తేదీన రెండు సభల్లో పాల్గొంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. నవంబరు 20వ తేదీన నితిన్ గడ్కరీ ఎల్లారెడ్డి అసెంబ్లీలో ఉ. 11 30 గం.లకు, కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభలో పాల్గొనడంతో పాటు సాయంత్రం రోడ్ షోలో పాల్గొంటారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నవంబరు 20వ తేదీన ముషీరాబాద్‌లో ఉదయం10:30 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..