Telangana: ఉన్నది పోయింది.. కొత్తగా వచ్చింది పోయింది..! బీఆర్ఎస్‌లో ఆ ఇద్దరు నేతలది వింత సమస్య

ఆ ఇద్దరు నేతలు రాజకీయాల్లో సీనియర్స్.. ఒకరు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు.. ఇంకొకరు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాలేదు. అందుకు బదులుగా ప్రోటోకాల్ ఉన్న నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్నారు. తీరా ఒకరోజు కూడా ఆఫీసుకు వెళ్ళకముందే ఉన్న పదవులు పోయాయి. ఇంతకీ ఈ పొలిటిషియన్స్ ఎవరనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

Telangana: ఉన్నది పోయింది.. కొత్తగా వచ్చింది పోయింది..! బీఆర్ఎస్‌లో ఆ ఇద్దరు నేతలది వింత సమస్య
Muthireddy Yadagiri Reddy - Thatikonda Rajaiah
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Shaik Madar Saheb

Updated on: Dec 11, 2023 | 4:25 PM

ఆ ఇద్దరు నేతలు రాజకీయాల్లో సీనియర్స్.. ఒకరు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచారు.. ఇంకొకరు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మొన్నటి ఎన్నికల్లో టికెట్ రాలేదు. అందుకు బదులుగా ప్రోటోకాల్ ఉన్న నామినేటెడ్ పోస్టులు దక్కించుకున్నారు. తీరా ఒకరోజు కూడా ఆఫీసుకు వెళ్ళకముందే ఉన్న పదవులు పోయాయి. ఇంతకీ ఈ పొలిటిషియన్స్ ఎవరనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే..

ఇద్దరివి పక్కపక్క నియోజకవర్గాలు. ఒకరు స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, మరొకరు జనగాం మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్.. తాజాగా జరిగిన తెలంగాణ ఎన్నికల్లో దాదాపుగా సిట్టింగ్ లకే సీట్లు ఇచ్చిన ఎనిమిది సీట్లను మాత్రం మార్చారు. అందులో రాజయ్య, ముత్తిరెడ్డికి టికెట్లు కేటాయించలేదు. అందుకు బదులుగా అప్పటికప్పుడు ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్, తాటికొండ రాజయ్యకు రైతుబంధు చైర్మన్ పోస్టులను కేటాయించారు. మూడేళ్లు ఈ పదవుల్లో కొనసాగే అవకాశం ఉందని ఎంతోకొంత తృప్తి చెందారు ఈ నేతలు. ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన నేతల కోసం పనిచేశారు కూడా.. అప్పుడు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తామని ఆఫర్ చేసిన వెళ్లలేదు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని గట్టిగా నమ్మారు.

అయితే, ఇంతలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో వీరి అంచనాలు తారుమరయ్యాయి. వచ్చిన చైర్మన్ పోస్టులను ఆఫీస్‌లో అడుగుపెట్టకముందే వదులుకోవాల్సి వచ్చింది. అన్ని కార్పోరేషన్ల చైర్మన్ల పదవులను రద్దు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 53 చైర్మన్ల పదవులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, రాజయ్య, ముత్తిరెడ్డికి నామినేటెడ్ పోస్టులు రాగానే కేవలం బాధ్యతలు మాత్రమే తీసుకున్నారు. పట్టుమని నెలరోజులు దాటకముందే పదవులు వదులుకోవాల్సి వచ్చింది. సిట్టింగ్లను కాదని కేటాయించిన ఈ రెండు నియోజకవర్గాల్లో గులాబీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు అంత ఆనందంగా ఏమీ లేరు.. ఈసారి మంత్రి పదవులు పక్కా అని పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి భావించారు. కానీ తీరా ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..