AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్ రియల్ ధమాకా.. బంజారాహిల్స్ టు మోకిలా.. మరో మెగా ల్యాండ్ వేలానికి సిద్ధమైన HMDA!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన ప్రభుత్వ భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల రికార్డు ధర పలకడంతో ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు మరో మెగా ఈ-వేలానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని అత్యంత విలువైన ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లోని భూములను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

హైదరాబాద్ రియల్ ధమాకా.. బంజారాహిల్స్ టు మోకిలా.. మరో మెగా ల్యాండ్ వేలానికి సిద్ధమైన HMDA!
Hmda Prime Properties Sales
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jun 10, 2026 | 12:32 PM

Share

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల రాయదుర్గంలో జరిగిన ప్రభుత్వ భూముల వేలంలో ఎకరాకు రూ.204 కోట్ల రికార్డు ధర పలకడంతో ఉత్సాహంలో ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు మరో మెగా ఈ-వేలానికి శ్రీకారం చుట్టింది. నగరంలోని అత్యంత విలువైన ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాల్లోని భూములను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

ఈ వేలంలో ప్రధాన ఆకర్షణ బంజారాహిల్స్‌లోని 8.24 ఎకరాల భూమి. హెచ్‌ఎండీఏ చరిత్రలో తొలిసారిగా ఈ ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని బహిరంగ వేలానికి ఉంచుతున్నారు. దీనికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధరను నిర్ణయించారు. నగర నడిబొడ్డున, ప్రీమియం కమర్షియల్ జోన్‌లో ఉన్న ఈ భూమిపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది.

మొత్తంగా 176 ప్లాట్లను వేలం కోసం గుర్తించారు. మోకిలాలో 100 ప్లాట్లు, మేడిపల్లిలో 68 ప్లాట్లతో పాటు నార్సింగి, చందానగర్, పీర్జాదిగూడ, బైరాగిగూడ, బౌరంపేట ప్రాంతాల్లోని పలు నివాస, వాణిజ్య ప్లాట్లను కూడా విక్రయించనున్నారు. అధికారుల ప్రకారం, బంజారాహిల్స్ భూమి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు సమీపంలో ఉంది. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, శంషాబాద్ విమానాశ్రయానికి మెరుగైన కనెక్టివిటీ అవకాశాలు ఉండటంతో ఈ స్థలం పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా మారనుంది. చుట్టుపక్కల కార్పొరేట్ ఆసుపత్రులు, స్టార్ హోటళ్లు, విద్యాసంస్థలు, కేబీఆర్ పార్క్ వంటి కీలక ప్రాంతాలు ఉండటం అదనపు ప్రయోజనంగా భావిస్తున్నారు.

వేలంలో భాగంగా ప్రాంతాల వారీగా కనీస ధరలను కూడా నిర్ణయించారు. మోకిలాలో గజానికి రూ.50 వేల నుంచి ప్రారంభం కానుండగా, చందానగర్-సూరారం ప్రాంతాల్లో రూ.60 వేలు, నార్సింగిలో రూ.50 వేలు, మేడిపల్లిలో రూ.45 వేలు, పీర్జాదిగూడ-బైరాగిగూడల్లో రూ.40 వేలు, బౌరంపేటలో రూ.30 వేలుగా అప్‌సెట్ ధరలను ఖరారు చేశారు.

జూన్ 17 నుంచి 30 వరకు దశలవారీగా ఈ-వేలం నిర్వహించనున్నారు. ముఖ్యంగా బంజారాహిల్స్ భూమికి జూన్ 19న వేలం జరగనుండటంతో రియల్ ఎస్టేట్, కార్పొరేట్ రంగాల దృష్టి ఇప్పుడు ఈ మెగా ఆక్షన్‌పైనే కేంద్రీకృతమైంది. రాష్ట్ర ఖజానాకు భారీ ఆదాయం తీసుకురావడమే కాకుండా, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ఈ వేలం మరో కీలక మైలురాయిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ మెగా ఈ-వేలం ద్వారా అటు రాష్ట్ర ఖజానాకు వేల కోట్ల భారీ ఆదాయం సమకూరడమే కాకుండా, హైదరాబాద్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పే మరో కీలక మైలురాయిగా నిలవనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
చినుకమ్మా రా.. అంటూ చిన్నారుల నృత్యం.. కప్పల కావడితో వరుణ దేవుడి
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
అరె..ఎవరీ మనిషి.. అచ్చం మన హీరో రవితేజలా ఉన్నాడు.. వీడియో వైరల్
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
బైక్ ఆగింది..పని ఆగలేదు..రెడ్ సిగ్నల్ వద్ద ల్యాప్‌టాప్‌తో ఉద్యోగి
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీబిజీ..!
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
రూ.2 లక్షల ఎఫ్‌డీపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ రేటును అందిస్తుంది?
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
చాణక్యుడి హెచ్చరిక.. ఈ విషయాలు బయటకు చెప్పొద్దు!
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
పెళ్లి మండపంలో కట్నం డబ్బులు ముట్టజెప్పిన మామగారు,వరుడిచ్చిన షాక్
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
వర్షాకాలంలో ఈ మొక్కలు నాటితే గ్రహాల అనుగ్రహం.. జ్యోతిష్యం ప్రకారం
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఓటీటీలో 'ధురంధర్' లాంటి స్పై యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది