తెలంగాణలో మళ్లీ ఉపద్రవం ఇరవై ఏళ్లలో ఇది ఎన్నోసారి?
ఉపఎన్నిక అంటేనే అదో రకం మజా. ఏదైనా నియోజకవర్గంలో ఏదైనా ప్రత్యేక కారణంతో బైపోల్ వచ్చిందంటే చాలు ఆ సెగ్మెంట్ అంతటా ఆకాశమంత సంబరం. ఎందుకంటే, సాధారణ ఎన్నికల కంటే, ఉపఎన్నికలప్పుడు ఓటు విలువ అమాంతం పెరుగుతుంది. సగటు ఓటరు మహాశయుడ్ని ప్రసన్నం చేసుకోడానికి మంత్రుల్ని, ముఖ్యమంత్రిని, వీలైతే కేంద్రమంత్రుల్ని కూడా ప్రయోగిస్తాయి పార్టీలు. ఎప్పుడూ టీవీల్లో పేపర్లలో మాత్రమే కనిపించే పెద్దపెద్ద కటౌట్లన్నీ మన గల్లీల్లోకొచ్చి మనకే దణ్ణం పెట్టి ఓట్లడుక్కుంటారు. రాత్రికిరాత్రే సిమెంట్ రోడ్లు పడతాయ్. బడికీ, గుడికీ రంగులేయిస్తారు. కాలనీకింత అని అన్ని పార్టీలనుంచీ అభివృద్ధి కోసం నిధులు మంజూరైపోతాయ్. పైగా, ఫలితాల తర్వాత పెద్దపెద్ద సంచలనాలు కూడా నమోదౌతాయ్. మీడియా మైకులు, వ్యాన్లన్నీ వచ్చి ఆ ఊరికి వద్దన్నకొద్దీ పబ్లిసిటీ ఇస్తారు. కానీ, ఆఖరాట పడేలోగా రాజకీయనాయకులకు మాత్రం తడిసి మోపెడవ్వుద్ది. కొన్ని పార్టీలకైతే చినిగి చాటవ్వుద్ది. ఇప్పుడు తెలంగాణలో కచ్చితంగా అదేగా జరగబోతోందా? ఉపఎన్నికల రణరంగంలో మరోసారి తెలంగాణం.

ఎప్పుడో మార్చి-ఏప్రిల్‌లో వచ్చే యాన్యువల్ ఎగ్జామ్స్‌కి ఇప్పట్నుంచే ఎందుకు పుస్తకాలతో కుస్తీ.. అని లైట్ తీసుకుంటే అంతేసంగతులు. మధ్యలో నెలకోసారి యూనిట్‌టెస్టులు, క్వార్టర్లీ, హాఫియర్లీ అంటూ స్పీడ్‌బ్రేకర్లుంటాయి. మధ్యమధ్యలో పెర్ఫామెన్సుల్ని లెక్కగడతారు గనుక స్టూడెంట్స్‌కి పరీక్షలంటే ఆ మాత్రం భయమూ భక్తీ ఉంది.. ఉంటుంది. ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీలక్కూడా సేమ్ ఫార్ములా. తమతమ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ల్ని ఎప్పటికప్పుడు ఎసెస్ చేసుకునే తీరాలి. అందుకోసమే ఉపఎన్నిక పేరుతో రాజ్యాంగం ప్రసాదించింది ఒక గోల్డెన్ ఛాన్స్. ఇప్పుడు తెలంగాణలో అటువంటి అగ్నిపరీక్షే ఒకటి రెడీగా ఉంది. ఉపఎన్నిక అనే మాట సూపర్‌గా ట్రెండింగ్‌లో ఉందిప్పుడు. ఉపఎన్నికల్లో ఏ పార్టీ స్ట్రైక్ రేట్ ఎంత? ఎన్నిసార్లు ఉపఎన్నిక రూలింగ్ పార్టీకి రెఫరెండమ్‌గా నిలిచింది? అని ఆరా తీస్తూ, గత జ్ఞాపకాల కోసం వెతుకుతూ సెర్చింజన్లను మోతెక్కిస్తున్నారు. పార్టీ ఆఫీసుల్లో కూడా అదే ఫికర్.. బైపోల్ ఫియర్. తెలంగాణలో స్టార్ ఆఫ్ ది డే ఎవరంటే.. మళ్లీ దానం నాగేందరే. అనర్హతకు గురై మిడిల్‌డ్రాప్ ఐన ఎమ్మెల్యేగా దానం పేరే ఇప్పుడు స్టేట్ మొత్తం రీసౌండ్ ఇస్తోంది. మొన్న హైకోర్టులో ఓడిపోవచ్చు. ఇవాళ సుప్రీంకోర్టులో ఓడిపోవచ్చు. రేపటిరోజున ఖైరతాబాద్‌లో మాత్రం గెలుపు నాదే..! అని బస్తీ మే సవాల్ కొడుతున్నారు తాజా మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్. అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాన్ని బైపాస్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును గట్టిగా సమర్థించింది సుప్రీంకోర్టు. ఘర్‌వాపసీ తప్పెలా అవుతుందని దానం అడ్వొకేట్ వాదిస్తే,...
