Pet Carnival: దేశంలోనే అద్భుతమైన జంతు ప్రదర్శన.. వేల సంఖ్యలో హాజరైన పెట్ లవర్స్..
హైదరాబాద్‌లోని నెక్లేస్ రోడ్డులో పెట్ కార్నివాల్ విజయవంతంగా ముగిసింది. పదులు కాదు..వందలు కాదు వేల సంఖ్యలో జంతు ప్రేమికులు, ప్రేక్షకులు ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించేందుకు తరలివచ్చారు. తమ చేతులతో.. అరుదైన పక్షులు, పాములు, కుక్కలు, పిల్లులు ఇతర జంతువులను తాకి ఆనందించారు.

హైదరాబాద్‌లోని నెక్లేస్ రోడ్డులో పెట్ కార్నివాల్ విజయవంతంగా ముగిసింది. పదులు కాదు..వందలు కాదు వేల సంఖ్యలో జంతు ప్రేమికులు, ప్రేక్షకులు ఈ మెగా ఈవెంట్‌ను వీక్షించేందుకు తరలివచ్చారు. తమ చేతులతో.. అరుదైన పక్షులు, పాములు, కుక్కలు, పిల్లులు ఇతర జంతువులను తాకి ఆనందించారు. డిసెంబర్ 23, 24 శని, ఆదివారం రెండు రోజుల పాటు అట్టహాసంగా సాగిన మాన్ కైండ్ పెట్ స్టార్ కార్నివాల్. మొదటి రోజు దేశంలో నలుమూలల నుంచి తమ పెంపుడు జంతువులను తీసుకొచ్చి ఈ అద్భుతమైన షోలో పాల్గొన్నారు. రెండో రోజు కూడా పెట్ స్టార్ కార్నివాల్లో వివిధ రకాల జంతువుల ప్రదర్శనలు పెట్ లవర్స్‌తోపాటు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా కామెల్ డాన్స్, హార్స్ డాన్స్ అదుర్స్ అనిపించింది. దీనికి తోడు దున్నపోతుల ఆట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనలు కన్నులారా వీక్షించిన జంతు ప్రేమికులు, ప్రేక్షకులు మంత్ర ముగ్దులయ్యారు. దాదాపు అన్ని జంతువులను ఒక్కచోట చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ రకాల పోటీల్లో విజేతలుగా నిలిచిన డాగ్స్, దున్నపోతులు, పిల్లులకు తెలంగాణ కానిన్ అసోసియేషన్ అధ్యక్షులు డా. చికోటి ప్రవీణ్ కుమార్, సెక్రటరీ విశాల్ సుధం, ఇతర సభ్యులు బహుమతులు అందజేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




