Road Accident: నారాయణపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ! ఐదుగురు దుర్మరణం

నారాయణపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటపలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం సైదాపూర్‌ గ్రామానికి చెందిన రెహమాన్‌బేగం(40) గత కొంతకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతోంది. ఆమెను చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం సంకలమద్దికి కుటుంబ సభ్యులు..

Road Accident: నారాయణపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ! ఐదుగురు దుర్మరణం
Road Accident
Follow us

|

Updated on: Dec 25, 2023 | 7:00 AM

నారాయణపేట, డిసెంబర్ 25: నారాయణపేట జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటపలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కర్ణాటక రాష్ట్రం సైదాపూర్‌ గ్రామానికి చెందిన రెహమాన్‌బేగం(40) గత కొంతకాలంగా ఆస్తమా వ్యాధితో బాధపడుతోంది. ఆమెను చికిత్స కోసం మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం సంకలమద్దికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. చికిత్స తీసుకున్న అనంతరం తిరుగు ప్రయాణంలో భర్త మౌలాలి(40), కలీల్‌(43), మరో వ్యక్తి వడివాల్‌తో కలిసి కారులో బయలుదేరారు. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోని కార్వాల్‌లో పనిచేస్తున్న నేవీ ఉద్యోగి దీపక్‌ సమల్, భార్య భవిత సమల్‌(35), కూతురు అవిస్మిత సమల్‌(8)తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఇటీవల దీపక్‌ సమల్‌కు విశాఖపట్టణానికి బదిలీ కావడంతో అక్కడికి వెళ్లేందుకు హైదరాబాద్‌కు బయలుదేరినట్లు సమాచారం.

మక్తల్‌ మండలంలోని జక్లేర్‌ గ్రామ సమీపంలో ఉన్న దాబా వద్దకు అతివేగంగా వచిన రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. రెహమాన్‌ బేగం, మౌలాలి, ఖలీల్, భవిత సమాల్, అవిస్మిత సమాల్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వడివాల్, దీపక్‌ సమల్‌ తీవ్ర గాయాల పాలయ్యారు. రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. దీపక్‌ సమల్‌ పరిస్థితి విషమించడంతో 108లో మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లారు. మృతదేహాలను మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ రాంలాల్‌ తెలిపారు. ప్రమాదానికి గురైన కార్లలో బెలూన్ల సౌకర్యం ఉన్నప్పటికీ అవి సకాలంలో ఓపెన్‌ కాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్టు పోలీసులు తెలిపారు. రోడ్డుపై డివైడర్‌ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.