Sangareddy: రాలిన ఆకుకు కొత్త జీవం.. ఈ ఆర్టిస్ట్ ట్యాలెంట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
శివకుమార్ అమ్మ, మేనమామ ఆలనాపాలనలో పెరిగాడు. చిన్ననాటి నుంచే చిత్ర కళపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ ఇంట్రెస్టే.. తనకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నో అవార్డులు, ప్రసంశా పత్రాలను తెచ్చిపెట్టింది. వివిధ రకాల ఆకులపై చిత్రాలు వేస్తాడు శివకుమార్. రాగి, బాదం, చింత, మందార, మామిడి, టేకు ఇలా పలు రకాల ఆకుల పై చిత్రాలు వేస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నడు శివకుమార్...
చెట్ల నుంచి రాలిన ఆకులు వాడిపోయి ఎండిపోతాయి. కొన్నాళ్లకు కుళ్లిపోతాయి. ప్రకృతిలో నిత్యం మనం చూసే తంతు ఇది. కానీ చెట్టు నుంచి రాలిన ఆకులు ఆ ఆర్టిస్ట్ చేతిలో పడితే మాత్రం అవి కొత్త జీవం పోసుకుంటాయి. రాలిపోయిన ఆ ఆకులే కళాఖండాలై చిగురిస్తాయి. నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటాయి. శాశ్వతమై నిలిచిపోతాయి. రాలిన రావి ఆకుకు కొత్త జీవం పోస్తూ, బొమ్మలు గీస్తున్న ఇతని పేరు గుండు శివకుమార్ ఇతనిది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణం.
శివకుమార్ అమ్మ, మేనమామ ఆలనాపాలనలో పెరిగాడు. చిన్ననాటి నుంచే చిత్ర కళపై ఎక్కువ ఆసక్తి ఉండేది. ఆ ఇంట్రెస్టే.. తనకు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నో అవార్డులు, ప్రసంశా పత్రాలను తెచ్చిపెట్టింది. వివిధ రకాల ఆకులపై చిత్రాలు వేస్తాడు శివకుమార్. రాగి, బాదం, చింత, మందార, మామిడి, టేకు ఇలా పలు రకాల ఆకుల పై చిత్రాలు వేస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్నడు శివకుమార్. దేశ స్వతంత్ర పోరాట యోధులతో పాటు మహాత్మా గాంధీ, సుభాశ్ చంద్రబోస్,సర్వేపల్లి రాధాకృష్ణ, అంబేద్కర్, అబ్దుల్ కలాం బొమ్మలతో పాటు, రాజకీయ నాయకులు అయిన నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు,కేటీఆర్..ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ ముఖచిత్రాలను రావి ఆకులపై అచ్చుకుద్దినట్లు గీశాడు.. వీటితో పాటు రాగి ఆకు పై తెలుగు,హిందీ,ఆంగ్ల అక్షరాలు, జాతీయ గీతన్ని సైతం పత్రాలపై నిలబెట్టాడు.
చూసిన బొమ్మలను నిమిషాల వ్యవధిలోనే ఆకుపై గీస్తూ అందరినీ ఆకట్టుకుంటు న్నాడు శివకుమార్. తనకు ఇష్టమైన కళను నమ్ముకుని స్వయంగా నేర్చుకుని, తప్పు ఒప్పులను, ఒడుదుడుకులను ఎదుర్కొంటూ చిత్ర ఉపాధ్యాయుడిగా ఎదిగాడు సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్‌కు చెందిన గుండు శివకుమార్. చిన్ననాటి నుంచే బొమ్మలు గీయటం అంటే ఏంతో మక్కువ, చదువుల్లో మెరుగ్గా ఉంటూ, దాంతో పాటే చిత్రాలు వేస్తూ అందరిలో భిన్నంగా ఉంటూ పేరు సంపాధించుకుంటూ వస్తున్నాడు. నాన్న సాయం లేకపోయిన అమ్మ ఆలనాపాలనలో పెరిగి పత్రాలపై చిత్రాలు గీస్తూ జాతీయ స్థాయి అవార్డులనూ కైవశం చేసుకున్నాడు. వృత్తిగా ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ విధానంలో విద్యార్థులకు చిత్రాలు వేయడం, పత్రాలపై ప్రతిభింబాలు మలచడం అలవోకగా నేర్పిస్తున్నారు.
ఏలాంటి శిక్షణ లేకుండా తమకున్న అవగాహన, ఆసక్తే తమకు ఇంతటి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిందంటు న్నాడు శివకుమార్. తొలినాళ్లలో ఉచితంగా చిత్రాలను గీస్తూ ప్రజల్లో మంచి ఆధారణ పొందాడు. ప్రస్తుతం అదే వృత్తి కొనసాగిస్తూ ఉపాధిగా మలుచుకున్నాడు గుండు శివకుమార్. కాగితాల పై ఎన్ని చిత్రాలు గీసినా శివకుమార్‌కి అనుకున్నంత గుర్తింపు రాకపోవడంతో, రకరకాలుగా చిత్రాలను గీశాడు.. అయిన కూడ సంతృప్తి లభించలేదు. ఇక తన ప్రతిభకు పదును పెట్టాలని నిర్ణయం తీసుకొని చేతితో బ్లేడు పట్టి ఆకును అస్ర్తంగా మలిచి, ఆకుల పై బొమ్మలు వేయటం ప్రారంభించాడు.
మెుదట్లో సాధారణ బ్లేడ్‌ను ఉపయోగించి కొన్ని చిత్రాలను రూపొందించాడు,కానీ సరైన ఆకృతులు రాకపోవడంతో, సోషల్ మీడియా ద్వారా కొన్ని విషయాలు తెలుసుకొని, ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక పరికరాలు, బ్లేడ్‌లను తెప్పించుకుని బొమ్మలు గీయటం మెుదలుపెట్టాడు. మొదట రోజుకు ఒక బొమ్మ గీయడం గగనంగా మారింది. అలా గీస్తూ,గీస్తూ అలవోకగా వేయడం అలవాటుగా మారింది.. మొదటగా స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, ఆయా కార్యాలయాల పేర్లు ఆకుల పై గీసి వారికి బహుమతిగా ఇవ్వడంతో మంచి పేరు వచ్చింది శివకుమార్ కి.. ఇక అప్పటి నుండి ఒక బొమ్మ వేయడానికి పట్టే సమయం నెమ్మదిగా తగ్గుతూ, గంటల వ్యవధిలో పలు వ్యక్తుల ముఖ చిత్రాలను తయారు చేస్తున్నాడు.
శివకుమార్ ఇప్పటి వరకు వెయ్యికి పైగా చిత్రాలను గీచి పలు, జాతీయ,రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నాడు. ఇలా సాంకేతికతను అందిపుచ్చుకొని వివిధ రూపాల్లో ఆకులపై బొమ్మలు వేస్తూ వాటికి ప్రాణం పోస్తున్నాడు. ప్రస్తుతం రావి ఆకుల పై గీసిన చిత్రాలకు ఫ్రేమ్ ఏర్పాటు చేసి చాలామందికి బహుకరిస్తున్నాడు. అంతే కాక తనకు మంచి గుర్తింపు రావాలని సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాడు శివకుమార్. తొలుత ప్రేమ్ వర్క్సకు సంబంధిన ఖర్చుకుడా తానే భరించి ఉచితంగా చిత్రాలను అందించాడు. కానీ ఖర్చు ఎక్కవ కావడంతో సాధరణ ఫేమ్‌కు వెయ్యి రూపాయలు, LED ఫ్రేమ్‌కు 1500 రూపాయలగా ధర నిర్ణయించాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..