AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ బంద్.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే?

నల్లమల అడవుల అందాలను ఆస్వాదిస్తూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో సఫారీ రైడ్ ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీ ప్రయాణాన్ని కాస్త వాయిదా వేసుకోవాల్సిందే.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ సేవలను మూడు నెలల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. ఎందుకో తెలుసా..?

Telangana: నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ బంద్.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారంటే?
Amrabad Tiger Reserve Safari Closed
Boorugu Shiva Kumar
| Edited By: |

Updated on: Jun 30, 2026 | 12:05 PM

Share

నల్లమల అడవి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులకు అధికారులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. అమ్రబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ సేవలను రేపటి నుంచి మూడు నెలల పాటు తాత్కాలికంగా నిలివేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ప్రకటించారు. జాతీయ పులుల సంరక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏడాది సంతానోత్పత్తి కాలంలో సఫారీ కార్యకలాపాలను నిలిపివేయడం ఆనవాయితీ. అదే విధంగా ఈ ఏడాది సైతం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో టైగర్ సఫారీతో పాటు అన్ని రకాల సఫారీ సేవలు అందుబాటులో ఉండవు. ప్రతి ఏడాది వర్షాకాలంలో పులులు, చిరుతలు, జింకలు, ఇతర వన్యప్రాణులు సంతానోత్పత్తి ప్రక్రియలో నిమగ్నమవుతాయి. ఈ సమయంలో అడవిలో మానవ సంచారం తగ్గించడంతో జంతువులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉంటుంది. వాటి సహజ జీవన విధానం కొనసాగడంతో పాటు వాటి పిల్లల సంరక్షణకు సైతం అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఈ కారణంగానే ప్రతి ఏడాది ఈ మూడు నెలల పాటు సఫారీ సేవలను నిలిపివేయడం జరుగుతూ వస్తోంది.

అతిపెద్ద రిజర్వ్..

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ తెలంగాణలోనే అతిపెద్ద అటవీ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. నల్లమల అటవీ ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ రిజర్వ్ ఫార్టెస్‌లో పులులతో పాటు చిరుతలు, సాంబార్ జింకలు, అడవి ఎద్దులు, ఎలుగుబంట్లు, అడవి పందులు, అనేక రకాల ఇతర జంతువులు, పక్షులకు అవాసంగా ఉంది. ప్రతి ఏడాది ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు అమ్రాబాద్ టైగర్ సఫారీకి వచ్చి స్వేచ్ఛగా సంచరించే పులిని దగ్గరగా ప్రత్యక్షంగా వీక్షిస్తారు. అలాగే దారి పొడవునా నల్లమల అడవి అందాలను ఆస్వాదిస్తారు.

ఇక అక్టోబర్ 1 నుంచి అమ్రాబాద్ టైగర్ సఫారీ సేవలను తిరిగి ప్రారంభించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. సఫారీకి వెళ్లాలనుకునే పర్యాటకులు తమ ప్రయాణ ప్రణాళికలను ఈ నిర్ణయానికి అనుగుణంగా రూపొందించుకోవాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ తీసుకున్న ఈ నిర్ణయానికి పర్యాటకులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

వీడియో చూడండి..

Follow Us
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
నల్లమల వెళ్లే పర్యాటకులకు బిగ్ అలర్ట్.. అమ్రాబాద్‌లో టైగర్ సఫారీ
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
పడకగదిలో ప్రియుడితో భార్యను చూసిన భర్త షాక్.. కట్ చేస్తే..!
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలో సమంత 'మా ఇంటి బంగారం'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
సమంత ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత తీసిన సన్నివేశాలు ఇవే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
ఇంట్లో పాలు విరిగి పోవటం శాపం కాదు.. అద్భుతమైన వరం..! ఎందుకంటే..
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
'నాకు చదువుకోవాలని ఉంది..' వేడుకుంటున్న బాలుడు!
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
తప్పులన్నీ గంభీర్‌వి.. తిట్లన్నీ శ్రేయస్ అయ్యర్‌కా?
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
భార్యాభర్తల దగ్గర ఈ సర్టిఫికేట్ ఉండాల్సిందే.. లేదంటే..
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
6 బ్యాంకులకు భారీ జరిమానా.. మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత
పంట పొలంలో నాగలికి తాకి బయటపడ్డ బంగారపు నిధులు.. ఆ తర్వాత