AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తండ్రిని చంపేందుకు ప్రయత్నించిన కొడుకు.. కట్ చేస్తే ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు..

ఈమధ్యకాలంలో నేరాలు అధికమవుతున్నాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులను చంపడం ఒక రకమైతే.. కన్న వాళ్లపైనే కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇలాంటి చర్యలు మాత్రం దేశవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ అల్వాల్‌‎లో చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన కుమారుడు సొంత తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడు.

Hyderabad: తండ్రిని చంపేందుకు ప్రయత్నించిన కొడుకు.. కట్ చేస్తే ఇద్దరినీ అరెస్ట్ చేసిన పోలీసులు..
Hyderabad Police Arrest
Srikar T
|

Updated on: Jan 23, 2024 | 3:04 PM

Share

హైదరాబాద్, జనవరి 23: ఈమధ్యకాలంలో నేరాలు అధికమవుతున్నాయి. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులను చంపడం ఒక రకమైతే.. కన్న వాళ్లపైనే కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. దీనికి కారణాలు ఏమైనప్పటికీ ఇలాంటి చర్యలు మాత్రం దేశవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ అల్వాల్‌‎లో చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన కుమారుడు సొంత తండ్రినే చంపేందుకు ప్రయత్నించాడు. కట్ చేస్తే తండ్రి కడుకులు ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుభాష్ నగర్ లో టోని థామస్ అనే రిటైర్డ్ సోల్జర్ తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. కొడుకు డామ్నిక్ థామస్ అతి చిన్న వయసులోనే మద్యం అలవాటు కావడంతో రీ హ్యాబిటేషన్ సెంటర్లో చేర్పించారు. మూడు నెలలపాటు ఇంట్లో థామస్ అతని భార్య మాత్రమే ఉండేవారు.

రీ హ్యాబిటేషన్ కేంద్రం నుంచి మూడు రోజుల క్రితమే కుమారుడు డామ్నిక్ థామస్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో పెంచుకుంటున్న గొర్రెల వ్యవహారంలో తీవ్ర చర్చ నడిచింది. తండ్రి కొడుకుల మధ్య మాట మాట పెరిగింది. దీంతో ఆవేశానికి గురైన కొడుకు ఇంట్లోని డబుల్ బారెల్ గన్ తో తండ్రిని బెదిరించాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసిన తల్లి భయభ్రాంతులకు లోనైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే రిటైర్డ్ సోల్జర్ ఇంటికి వచ్చిన పోలీసులు ఆతని కుమారుడు డామ్నిక్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గన్ ఎక్కడిది అన్న కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు ఆ గన్ రిన్యూవల్ చేయించకపోవడంపై తండ్రిపై కూడా కేసు నమోదు చేశారు. లైసెన్స్ లేని మారణాయుధాలను ఇంట్లో ఉంచుకున్నందుకు కేసు బుక్ చేశారు. ఇద్దరినీ పోలీస్ స్టేషన్‎కు తరలించి విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
పురును ఏ రోజు కొనాలి.. ఇంట్లో ఏ దిక్కున ఉంచాలి..?
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ప్రతి ఉద్యోగిని ఆలోచింపజేస్తున్న చిన్నారి ప్రశ్న!
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!