Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AICC: తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించిన ఏఐసీసీ.. ఎవరెవరికి..ఏయే పదవులంటే..

తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. పీఏసీ చైర్మన్‌గా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ కొనసాగుతారు.

AICC: తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించిన ఏఐసీసీ.. ఎవరెవరికి..ఏయే పదవులంటే..
Rahul
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 12, 2021 | 4:34 PM

Telangana Congress: తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏఐసీసీ ప్రకటించింది. పీఏసీ చైర్మన్‌గా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కం టాగోర్ కొనసాగుతారు. కన్వీనర్‌గా షబ్బీర్ అలీ, సభ్యులుగా రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్, పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, రేణుక చౌదరి, బలరాం నాయక్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, సీతక్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియమితులయ్యారు. ఇక, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఏఐసీసీ ఆమోదించిన కమిటీల ఛైర్మన్లు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణకు చెందిన ఏఐసీసీ సెక్రటరీ ఇంచార్జిలు కూడా పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఉంటారు.

కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు ఎప్పుడూ ఉండేదే. నేతలు ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకోవడం కొత్తేమీ కాదు. తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి రేవంత్‌రెడ్డికి దక్కకుండా చాలామంది నేతలు ఎన్నో కుట్రలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. మొత్తానికి అడ్డంకులన్నీ అధిగమించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్‌రెడ్డి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.

బీజేపీ, టీఆర్ఎస్‌కు ధీటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలని రేవంత్ రెడ్డి ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాలకు తమ పార్టీ జాతీయ నాయకులను.. అందులోనూ రాహుల్ గాంధీని తీసుకురావాలని గట్టిగానే ప్రయత్నించారు. నిజానికి తెలంగాణ విమోచన దినోత్సవమైన సెప్టెంబర్ 17న వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా సభను ఏర్పాటు చేసి.. ఆ సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ భావించింది. ఇందుకు సంబంధించి ఆయన సమయాన్ని కూడా కోరింది. ఆ రోజు తెలంగాణలో బీజేపీ పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహిస్తుందని.. వాటికి ధీటుగా కాంగ్రెస్ కూడా భారీ సభను ఏర్పాటు చేస్తే బాగుంటుందని రేవంత్ రెడ్డి భావించారు.

ఇందుకు సంబంధించి ప్రతిపాదనలను కూడా కాంగ్రెస్ హైకమాండ్‌కు పంపారు. రాహుల్ గాంధీతో సభను ఏర్పాటు చేయించాలని యోచించారు. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. దీంతో సెప్టెంబర్ 17న గజ్వేల్‌లో కాంగ్రెస్ సారథ్యంలోని నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే వచ్చేలా ఏర్పాట్లు చేసింది కాంగ్రెస్.

Read also: Somu Veerraju: మత్స్యకారులను పాలగాళ్ళెగా మార్చే కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది: సోము వీర్రాజు