Vinayaka Chavithi: అక్కడ మండపంలో గణపతి చుట్టూ తిరుగుతూ ఎలక్షన్స్‌లో గెలిపించమని కోరుతున్న అభ్యర్థులు .. ఎక్కడంటే..
Vinayaka Chavithi 2021: దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణేశుడు భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. కొన్ని మండపాల్లోని గణపతి..
Vinayaka Chavithi 2021: దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో కొలువుదీరిన గణేశుడు భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. కొన్ని మండపాల్లోని గణపతి.. పర్యావరణానికి ప్రతీకగా నిలిస్తే.. మరికొన్ని సామజిక అవగాహన కలిగించేవిగా ఉన్నాయి.. ఇంకొన్ని తాజా రాజకీయ పరిస్థితులకు అడ్డంపట్టేలా మండపాలను భక్తులు తీర్చిఇద్దరు. ఇక వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో మండపాల్లో కొలువుదీరిన వినాయకుడు భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. తాజాగా తెలంగాణలోని ఎన్నికల వేడిని రేకెత్తిస్తున్న హుజురాబాద్ లో గణేష్ మండపంలో తాజా రాజకీయ పరిష్టితులకు అడ్డంపట్టేలా గణపతిని ప్రతిష్టించారు అచ్చంపేట వాసులు. వివరాల్లోకి వెళ్తే..
మంత్రి ఈటెల రాజీనామాతో హుజూరాబాద్ ఎన్నికలలో బై ఎలక్షన్ జరగనున్నాయి. ఈ ఎన్నికల నేపధ్యంలో తెలంగాణా రాజకీయాలు వేడెక్కాయి. దీంతో ప్రస్తుత రాజకీయాలు ప్రతిబింభించే విధంగా అచ్చంపేట వాసులు వినూత్న గణపతిని ప్రతిష్టించారు. గెలుపు కోసం రాజకీయ పార్టీల నాయకులు గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రూపొందించారు. ప్రస్తుతం ఈ గణపతి ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఇంద్రా నగర్ కాలనిలో వినాయక చవితి సంధర్భంగా వినూత్న రీతిలో మండపాన్ని అలంకరించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా వినూత్న గణపతిని ప్రతిష్టించారు ఇంద్రానగర్ కాలనీ వాసులు. హుజురాబాద్ కు చెందిన రాజకీయ నాయకుల బొమ్మలు గణపతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు రూపొందించారు. హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించేలా వినాయకుడు ఆశీర్వదించాలన్నట్లు…విఘ్నేశ్వరుడి చుట్టూ తిరుగుతున్న అభ్యర్ధుల బొమ్మలు అందరిని ఆకర్షిస్తున్నాయి.
Also Read : తరచుగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారా.. ఐతే మీ ఇంటి మిద్దెమీద ఇవి ఉన్నాయేమో చూడండి..