Chanakya Niti: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. అలా చేస్తే చులకన అయిపోతారంటున్న చాణక్య

Chanakya Niti: మౌర్యచక్రవర్తికి మంత్రిగా పనిచేసిన చాణుక్యుడు పండితుడు.. ఆనాటి అఖండ భారత సార్వ భౌమత్వానికి ముప్పులేకుండా చేయగల్గిన మేధావి చాణక్యుడు.  కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా..

Chanakya Niti: ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. అలా చేస్తే చులకన అయిపోతారంటున్న చాణక్య
Chanakya Niti
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2021 | 4:37 PM

Chanakya Niti: మౌర్యచక్రవర్తికి మంత్రిగా పనిచేసిన చాణుక్యుడు పండితుడు.. ఆనాటి అఖండ భారత సార్వ భౌమత్వానికి ముప్పులేకుండా చేయగల్గిన మేధావి చాణక్యుడు.  కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలను తెలియజేశారు. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరిస్తూ.. చాణుక్యుడు నీతి శాస్త్రం రచించారు. నేటి సమాజానికి ఉపయోగపడే అనే విషయాలను తెలియజెప్పాడు. వీటిని చాణక్య నీతి అంటాం..  కొంతమంది ఎటువంటి విషయాలు ఎవరితో పంచుకోకూడదో తెలియక ఇబ్బంది పడితే.. మరికొందరు.. అందరు మనవాళ్లే అని భావించి.. అన్ని వారితో పంచుకుని తర్వాత ఇబ్బందులు పడుతుంటారు.  అటువంటి వారిని ఉద్దేశించి తత్వవేత్త, ఆచార్యుడు చాణిక్యుడు చెప్పిన కొన్ని నియమాల గురించి ఈరోజు తెలుసుకుందాం..

సర్వసాధారణంగా మనం చాలా విషయాలు బంధువులు, స్నేహితులతో పంచుకుంటూ ఉంటాం. అయితే అలా పంచుకోవడం వలన ఏర్పడితే తర్వాత పరిణామాల గురించి పెద్దగా ఆలోచించం. అయితే కొన్ని వ్యక్తిగత విషయాల గురించి ఎంత కష్టం వచ్చినా అందరితోనూ పంచుకోకూడదు. ముఖ్యంగా మనం ఆర్థిక సమస్యలు అనుభవిస్తూ ఆర్థికంగా చితికిపోయినప్పుడు మన బంధువులతోనూ, అయినవారు అనుకున్నవారితో బాధలు, కష్టాలు చెప్పుకుంటాం. అయితే అలా బంధువులతో మన కష్టం గురించి చెప్పుకోవడంతో వారు సహాయం చేయకపోగా..  బయటకు వెళ్లి మన గురించి తక్కువ చేసి హేళనగా మాట్లాడుతారని చాణుక్యుడు చెప్పాడు. అందుకనే మనం మన వ్యక్తిగత సమస్యల గురించి అందరితో చెప్పకూడదు. గతంలో జరిగిపోయిన చేదు జ్ఞాపకాలు, మన వలన జరిగిన పొరపాట్లు, మన ఆరోగ్య సమస్యలు గురించి, మన ప్రవర్తన గురించి, మన రహస్యాలు గురించి ఎవరికీ ఎక్కువగా చెప్పకూడదు.  అలా చెప్పడం వలన అందరూ మనల్ని చిన్నతనంగా చూస్తారు.

ఇప్పుడు స్నేహితులుగా ఉన్నవారు పరిస్థితుల ప్రభావంతో శత్రువులుగా మారితే.. మనం వారి చెప్పిన రహస్యాలు తెలియడంతో మన గురించి మనల్ని తక్కువ చేసి అపహాస్యం చేయవచ్చు లేదా అందరిలోనూ మనల్ని తక్కువ చేసి మాట్లాడవచ్చు.

ఇక కుటుంబ సమస్యలు,  భార్య భర్తల మధ్య గొడవలు లేదా సమస్యలు ఉన్నప్పుడు కూడా వాటి గురించి బయట వారితో చెప్పకూడదు.  కుటుంబంలోని సమస్యలను భార్యాభర్తలిద్దరూ మాత్రమే కూర్చొని మాట్లాడుకోవడం వలన పరిష్కారం లభిస్తుంది. అపార్థాలు తొలగి సమస్యలు తీరుతాయి. అంతేగానీ బయట కుటుంబ సమస్యలను పంచుకోవడం వలన భార్య భర్తల బంధాన్ని బయట వారి తక్కువ చేసే అవకాశం ఉంది.

కొన్నిసార్లు మన పొరపాటు ఉన్నా లేకపోయినా మనం అవమానాలపాలు అవుతుంటాం. వాటి గురించి ఎవరితోనూ చెప్పుకోకూడదు. అలా చెప్పడం వలన మనల్ని ఓదార్చడానికి ముందు కొన్ని మంచి మాటలను చెబుతారు.. పక్కకు వెళ్లిన వెంటనే మన గురించి తక్కువగా తప్పుగా మాట్లాడతారు.  కొంతమంది  రకరకాల కథలు అల్లి మన గురించి తప్పుడు ప్రచారం చేస్తారు. అందుకే  అన్ని విషయాలను అందరితోనూ పంచుకోకూడదు. మనం మనసు తేలిక అవుతుందని మనసులో విషయాలు బంధువులు, స్నేహితులతో పంచుకుంటాము. ఇంట్లో వారితో తప్ప ఎవరితోనూ చెప్పకూడదని అలాకాకుండా అందరిని నమ్మి అన్ని విషయాలను అందరితోనూ పంచుకుంటే అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చాణుక్యుడు చెప్పిన సూచన.

Also Read:

 వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవడానికి ఎలాంటి భూమిని ఎంచుకోవాలి..! లోపాలుంటే ఏం చేయాలి..?