Vastu Tips: తరచుగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారా.. ఐతే మీ ఇంటి మిద్దెమీద ఇవి ఉన్నాయేమో చూడండి..

Vastu Tips: భారతీయులకే నమ్మకాలు ఎక్కువ... ముఖ్యంగా హిందువులకే దశ దిశ, మంచి, చెడు తిధులు. మంచి, చెడు రోజులంటూ నమ్మకాలు.. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ.. కొంతమంది హేతువాదులు..

Vastu Tips: తరచుగా ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారా.. ఐతే మీ ఇంటి మిద్దెమీద ఇవి ఉన్నాయేమో చూడండి..
Vastu Tips
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2021 | 5:35 PM

Vastu Tips: భారతీయులకే నమ్మకాలు ఎక్కువ… ముఖ్యంగా హిందువులకే దశ దిశ, మంచి, చెడు తిధులు. మంచి, చెడు రోజులంటూ నమ్మకాలు.. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ.. కొంతమంది హేతువాదులు వాదిస్తుంటారు. అయితే నిజానికి భారతీయులకే కాదు.. ఆసియా దేశాలైన చైనా, జపాన్, కొరియా, వంటి అనేక దేశాల ప్రజలు దేవుడు దెయ్యం, వాస్తు నిర్మాణం వంటి అనేక విషయలపై నమ్మకాలు ఉన్నాయి.  ముఖ్యంగా ఏ దేశంలోనైనా ఇళ్ల నిర్మాణంలో వాస్తు పద్దతిని ఆ దేశ సంప్రదాయాలకు అనుగుణంగా చూస్తారు.. ఇక హిందువుల్లో అయితే ఏదైనా సమస్య ఏర్పడితే.. తరచుగా ఇబ్బందులు తెలెత్తితే.. తప్పకుండా ఇంటిలోని వాస్తు పై దృష్టి పెడతారు. పండితులను ఆశ్రయిస్తారు.  కొంతమంది ఎక్కువగా ఆర్ధిక ఇబ్బందులకు గురవుతారు.. ఇటువంటి వారు తమ ఇంటి మేడ మీద పాత ఇనుప సామాన్యు పెట్టారేమో ఒక్కసారి చెక్ చేయమంటున్నారు వాస్తు పండితులు..

ప్రస్తుతం ఇల్లు ఇరుకుగా ఉంటున్నారు. దీంతో సర్వసాధారణంగా తాము నివాసం ఉండే మెడ మీద లేదా ఇంటి పైకప్పు మీద పాత సామాన్లును పెట్టాల్సి వస్తుంది. దీంతో ఇంట్లో స్థలం దొరుకుంటుందని ఇంటి యజమాని భావిస్తారు. అయితే ఇలా మేడ మీద పాత సామాన్యులు పెట్టడం మంచిది కాదని పండితులు అంటున్నారు.

ఇలా చేయడం వలన అనేక దుష్ప్రభావాలు పడతాయని హెచ్చరిస్తున్నారు. ఇంటి మేడ మీద లేదా ఇంటి పైకప్పు మీద పనికి రాని పాత సామాన్లని పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. దేనివలన ఎన్నో సమస్యలు  ఏర్పడానికి ఒక కారణం అవుతుందని..ముఖ్యంగా పితృ దోషం కూడా కలుగుతుందని పండితులు హెచ్చరిస్తున్నారు.  ప్రతి ఇంట్లో మనం ఉంచే సామాన్లు, దాని స్థానం బట్టి.. ప్రభావం చూపిస్తాయని..కొన్నిటి పై నెగెటివ్ ప్రభావం పడుతుందని కనుక పనికిరాని సామాన్లని మేడ మీద పెట్టవద్దని పండితులు చెబుతున్నారు. ఇలా నెగిటివ్వీ ఎనర్జీ ఏర్పడితే కుటుంబంలో సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Also Read:  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నాలుగు విషయాలను ఎవరితోనూ పంచుకోకండి.. అలా చేస్తే చులకన అయిపోతారంటున్న చాణక్య..

Marriage Registration: ఇక నుంచి దంపతులు మ్యారేజ్ రిజిస్ట్రేషన్‌ను ఆన్ లైన్‌లోనూ చేసుకోవచ్చంటున్న హైకోర్టు..