AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moles: శరీరంలోని ఈ 5 భాగాలలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు..! ఎలాగో తెలుసుకోండి..

Moles: మానవ శరీరంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. వీటి ద్వారా ఒక వ్యక్తి స్వభావం, అదృష్టం గురించి తెలుసుకోవచ్చు. ముఖంపై ఉన్న పుట్టు మచ్చలు వారి

Moles: శరీరంలోని ఈ 5 భాగాలలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులు..! ఎలాగో తెలుసుకోండి..
Moles
uppula Raju
|

Updated on: Sep 12, 2021 | 7:02 PM

Share

Moles: మానవ శరీరంపై చాలా పుట్టుమచ్చలు ఉంటాయి. వీటి ద్వారా ఒక వ్యక్తి స్వభావం, అదృష్టం గురించి తెలుసుకోవచ్చు. ముఖంపై ఉన్న పుట్టు మచ్చలు వారి అందాన్ని రెట్టింపు చేయడమే కాకుండా వారి లక్షణాలను కూడా తెలియజేస్తాయి. శరీర భాగాలపై ఉన్న పుట్టుమచ్చల ద్వారా ఆ వ్యక్తి ధనవంతుడా, పేదవాడా, మంచి చెడుల గురించి అంచనా వేయవచ్చు. అయితే శరీరంలో ఏ భాగంలో పుట్టుమచ్చ ఉంటే అదృష్టవంతులో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పెదవిపై పుట్టుమచ్చ పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ చాలా అదృష్టవంతురాలు. ఆమె జీవితంలో అన్ని రకాల ఆనందాలను పొందుతుంది. అలాగే ఒక పురుషుడి పై పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అతడు అన్ని రకాల సౌకర్యాలను సులభంగా పొందుతాడు.

2. చెవి మీద పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రం ప్రకారం.. చెవులపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు కష్టపడి పనిచేసే గుణం కలవారు. చాలా నిజాయితీ పరులు. జీవితంలో శ్రమతో పురోగతి సాధిస్తారు. చాలా డబ్బు సంపాదిస్తారు.

3. నుదిటిపై పుట్టుమచ్చ సాముద్రిక శాస్త్రం ప్రకారం.. నుదుటి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు చాలా అదృష్టవంతులు. అన్ని రకాల ఆనందం, సంతోషాలను అనుభవిస్తారు. అలాంటి వ్యక్తులు చాలా డబ్బు, కీర్తి, గౌరవాన్ని పొందుతారు.

4. కళ్ళ మీద పుట్టుమచ్చ కళ్ళపై పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు సులభంగా ప్రజలను ఆకర్షిస్తారు. కంటి మీద పుట్టుమచ్చ ఉన్న పురుషుడు లేదా స్త్రీలకు అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలతో ఉంటారు.

5. అరచేతిలో పుట్టుమచ్చ అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉన్న వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తి జీవితం అకస్మాత్తుగా మారుతుంది. అతను అన్ని సంతోషాలను పొందుతాడు. చాలా ధనవంతుడు అవుతాడు.

6. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి మాత్రమే ఉంటుందని గ్రహించండి.

Viral Video: ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బ్లాక్‌ కోబ్రా..! తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌..

Bike Accident: ట్రిపుల్ రైడ్ చేస్తూ డివైడర్‌ను ఢికొట్టిన యువకులు.. ఇద్దరు స్పాట్ డెడ్.. మరొకరికి

Used Cars: సెకండ్ హ్యాండ్ కారుకు బ్యాంకు లోను కోసం ప్రయత్నిస్తున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటో తెలుసుకోండి!