Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బ్లాక్‌ కోబ్రా..! తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌..

Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను చూస్తే

Viral Video: ఆడుకుంటున్న చిన్నారి వద్దకు బ్లాక్‌ కోబ్రా..! తర్వాత ఏం జరిగిందో చూస్తే షాక్‌..
Black Snake
Follow us
uppula Raju

|

Updated on: Sep 12, 2021 | 6:59 PM

Viral Video: ఇటీవల సోషల్ మీడియాలో జంతువులు, పాములు, పక్షులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ వీడియోలను చూస్తే భయంతో వణికిపోవాల్సిందే. మరికొన్ని వీడియోలు మాత్రం పొట్ట చెక్కలయ్యేంతగా నవ్విస్తాయి. కానీ ఓ వీడియో మాత్రం నెటిజన్లు ఒకింత షాక్‏కు గురిచేసింది. ఆశ్చర్యంతోపాటు.. భయం కూడా కలిగించింది. పాములు అంటే చాలా మందికి భయం. పాము కనిపిస్తే చాలు భయంతో పరుగులు పెడతారు. ఇక ఒంటరిగా వెళ్తుంటే పాము ఎదురైతే అంతే సంగతులు.

అయితే తాజాగా ఒక పాము ఒక చిన్నపాప గదిలో ఆడుకుంటుండగా ఎంటర్‌ అయింది. ఈ వీడియో చాలా ఉత్కంఠగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఒక చిన్నారి గదిలో బొమ్మలతో ఆడుకోవడం మనం వీడియోలో చూడవచ్చు. ఆమెకు సమీపంలోనే ఓ మహిళ కంప్యూటర్‌తో పనిచేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆమెకు ఓ ఫోన్‌ కాల్ వస్తుంది. వెంటనే ఆ మహిళ చిన్నపాపని ఒంటరిగా వదిలి గది నుంచి బయటకు వెళ్లిపోతుంది. అప్పుడే గదిలోకి ఒక నల్ల త్రాచుపాము ఎంటర్ అవడం మనం వీడియోలో చూడవచ్చు.

ఈ సమయంలో ఆ చిన్నారి బొమ్మలతో ఆడుకుంటు ఉంటుంది. కొద్దిసేపటికి పాప ఆ పామును గమనిస్తుంది. అక్కడి నుంచి లేచి దాని వైపు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. ఈ సందర్భంలో వీడియో నెటిజన్లు చాలా టెన్షన్ గురవుతారు. అయితే తర్వాత ఏం జరిగిందో ఎవరూ ఊహించలేరు. అమ్మాయి పాము వైపు ఒక్కొక్కటిగా బొమ్మలు విసురుతుండటం మనం వీడియోలో గమనించవచ్చు. అయితే చివరికి ఏం జరిగిందో మాత్రం తెలియలేదు. ఎందుకంటే అక్కడికే వీడియో ఎండ్ అవుతుంది. nsta celebrate అనే ఖాతా నుంచి ఈ వీడియో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోను 90 లక్షల మందికి పైగా చూశారు. చాలామంది రకరకాల కామెంట్లు చేశారు. ఎక్కువ మంది చివరకు ఏమైందని అడుగుతున్నారు. ఏదిఏమైనా ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Thalaivi: తలైవి సినిమాపై భిన్నాభిప్రాయాలు.. కంగనా కంటే జయలలిత పాత్రలో ఆ హీరోయిన్ ఉంటే బాగుండేది అంటూ..

UPSC Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త..! UPSC నుంచి ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ జారీ..

Viral Video: నిద్రిస్తున్న వ్యక్తి దుప్పట్లోకి దూరిన పాము.. ఆ తర్వాత ఊహించని సీన్