Thalaivi: తలైవి సినిమాపై భిన్నాభిప్రాయాలు.. కంగనా కంటే జయలలిత పాత్రలో ఆ హీరోయిన్ ఉంటే బాగుండేది అంటూ..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరక్కెక్కిన సినిమా తలైవి. వినాయక చవితి సందర్భగా విడుదలైన

Thalaivi: తలైవి సినిమాపై భిన్నాభిప్రాయాలు.. కంగనా కంటే జయలలిత పాత్రలో ఆ హీరోయిన్ ఉంటే బాగుండేది అంటూ..
Thalaivi
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2021 | 5:38 PM

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితకథ ఆధారంగా తెరక్కెక్కిన సినిమా తలైవి. వినాయక చవితి సందర్భగా విడుదలైన ఈ మూవీ సక్సెస్ టాక్ అందుకుంది. ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించింది. ఇక ఇందులో కంగనా… జయలలిత పాత్రలో ఒదిగిపోయారు. శుక్రవారం విడుదైలన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‏తో దూసుకుపోతుంది. అంతేకాదు.. ఇందులో జయలలిత పాత్రలో నటించిన కంగనా నటనకు ప్రేక్షకుల ఫిదా అయ్యారు. కంగనా తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. తాజాగా ఈ సినిమా గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో జయలలిత పాత్రపై సరికొత్త టాక్ తెరపైకి వచ్చింది.

తలైవి సినిమాలో జయలలిత పాత్రకు కంగనా కంటే ఐశ్యర్య రాయ్ నటించి ఉంటే బాగుండేది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అప్పట్లో జయలలిత నెంబర్ వన్ హీరోయిన్ అని.. ప్రస్తుతం బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ అని.. ఈ పాత్రలో ఐశ్వర్య నటించాల్సి ఉంటే బాగుండేది అంటూ సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. గతంలో జయలలితను ఇంటర్వ్యూ చేసినప్పుడు తన బయోపిక్ ఎవరు చేయాలని ప్రశ్నించగా.. ఐశ్వర్య పేరు చెప్పిందని ఓ జర్నలిస్ట్ తెలిపాడు. తలైవి సినిమాను ఐశ్వర్య చేసి ఉంటే బాగుండేది అని.. అమ్మ ఆత్మ శాతించేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే జయలలిత బయోపిక్ పై వెబ్ సిరీస్ వచ్చింది. అమ్మ కోరికతో ఐశ్వర్య రాయ్ తో సినిమాను ఎవరైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ప్రస్తుతం తలైవి సినిమా థియేటర్లలో సూపర్ హిట్‏గా నిలిచింది.

Also Read: Maa Elections 2021: బండ్ల గణేష్ ట్వీట్‏కు రీకౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. హర్ట్ అయ్యారేమో అంటూ షాకింగ్ కామెంట్స్..

మాస్కుతో క్రేజీ ఫోజులు ఈ అమ్మడికే సొంతం.. ఈ ఫోటోస్‏లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ హెల్త్ అప్‏డేట్.. సక్సెస్‏ఫుల్‏గా సర్జరీ కంప్లీట్..