AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: సారీ… దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను… హీరోయిన్‌ నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఇస్మార్ట్ గర్ల్ గా తెలుగు జనాలకు గుర్తుండిపోయిన హీరోయిన్‌ నభా నటేష్‌. రామ్‌తో ఓ రేంజ్‌ మాస్‌ గా యాక్ట్ చేసిన ఆమెకు ఆ తర్వాత ఆ రేంజ్‌ హిట్‌

Nabha Natesh: సారీ... దాని గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను... హీరోయిన్‌ నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Nabha Natesh
Rajitha Chanti
|

Updated on: Sep 12, 2021 | 5:53 PM

Share

ఇస్మార్ట్ గర్ల్ గా తెలుగు జనాలకు గుర్తుండిపోయిన హీరోయిన్‌ నభా నటేష్‌. రామ్‌తో ఓ రేంజ్‌ మాస్‌ గా యాక్ట్ చేసిన ఆమెకు ఆ తర్వాత ఆ రేంజ్‌ హిట్‌ పడలేదు. త్వరలో రిలీజ్‌ కాబోతున్న మాస్ట్రోతో సూపర్‌ సక్సెస్‌ గ్యారంటీ అంటున్నారు నభా. మాస్ట్రో అండ్‌ అదర్‌ అంశాలతో నభా నటేష్‌ చిట్‌చాట్‌…

‘ అంధాధున్‌ సినిమా చూశారా? – చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా. ఆ సినిమా రిలీజ్‌ అయినప్పుడు అందరూ దాని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. వెంటనే చూసేశా. ‘ ఆ సినిమా రీమేక్‌లో మీరు నటిస్తారని ఊహించారా? – అస్సలు లేదు. కానీ ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది. ‘ ఫస్ట్ టైమ్‌ రీమేక్‌లో నటిస్తున్నట్టున్నారు? – అవును. ఇది నా మొదటి రీమేక్ సినిమా. ఆఫర్‌ రాగానే హ్యాపీగా అనిపించినా, వెంటనే కాస్త కంగారుపడ్డాను. ఒరిజినల్‌లో రాధికా ఆప్టే అద్బుతంగా నటించింది. ఆమెలా నేను ఎలా చేయగలనా? అని భయం వేసింది. కానీ కాన్ఫిడెంట్‌గా చేశా. ‘ కరోనా ఉన్నప్పుడే షూటింగ్‌ చేసేశారట కదా? – (నవ్వుతూ). కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. మేమే మొదటగా సెట్‌కు వెళ్లామనుకుంటాను. అప్పుడు రెస్టారెంట్, పబ్ సీన్స్ చేశాం. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. షాట్ చేసేసి మేం పరిగెత్తే వాళ్లం. మా జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్లం. ‘ నితిన్‌తో వర్కింగ్‌ ఎక్స్ పీరియన్స్ చెప్పండి? – అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా మధ్య సీన్స్, సాంగ్స్ బాగా వచ్చాయి. ‘ ఓటీటీలో విడుదలవుతుండటం ఎలా ఉంది? – కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ఈ సినిమా ఓటీటీలో వస్తుంది అని అనుకున్నాను. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది. ‘ ఒరిజినల్‌కి మార్పులేమైనా చేశారా? – కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది. ‘ లాక్‌డౌన్‌ టైమ్‌లో ఏం చేశారు? – లాక్డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్‌‌‌లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈ సారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు. ‘ ఈ సినిమాకు డబ్బింగ్‌ చెప్పారా? – డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను. ‘ మీ నెక్స్ట్ ప్రాజెక్టులేంటి? – భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఐ యామ్‌ సారీ. నేను ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మాస్ట్రోలోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను.

– సతీష్ రెడ్డి జడ్డా, TV9 తెలుగు, ET డెస్క్.

View this post on Instagram

A post shared by Nabha Natesh (@nabhanatesh)

Also Read: Thalaivi: తలైవి సినిమాపై భిన్నాభిప్రాయాలు.. కంగనా కంటే జయలలిత పాత్రలో ఆ హీరోయిన్ ఉంటే బాగుండేది అంటూ..