Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suman on Drug Case: సినీ ఫిల్డ్‌లో మాత్రమే కాదు.. అన్ని చోట్లా ‘డ్రగ్స్ దందా’ ఉంది.. సుమన్ సెన్సేషనల్ కామెంట్స్

Suman on Tollywood Drug Case: దక్షిణ భారత సీనియర్ నటుడు, రియల్ హీరో సుమన్  సినీ పరిశ్రమలోని తాజా పరిస్థితులపై స్పందించారు. అంతేకాదు తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని వేరే వాటిపై దృష్టి పెట్టె..

Suman on Drug Case: సినీ ఫిల్డ్‌లో మాత్రమే కాదు.. అన్ని చోట్లా 'డ్రగ్స్ దందా' ఉంది.. సుమన్ సెన్సేషనల్ కామెంట్స్
Hero Suman
Follow us
Surya Kala

|

Updated on: Sep 12, 2021 | 6:32 PM

Suman on Tollywood Drug Case: దక్షిణ భారత సీనియర్ నటుడు, రియల్ హీరో సుమన్  సినీ పరిశ్రమలోని తాజా పరిస్థితులపై స్పందించారు. అంతేకాదు తాను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నానని వేరే వాటిపై దృష్టి పెట్టె ఖాళీ లేదని అన్నారు. నేను సినిమాల పరంగా బిజీగా ఉన్నాను.. ఇక ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఎల్లవేళలా అందుబాటులోకి ఉండడం వీలుకాదు.. దీంతో ఆ పోస్టుకి నేను సరైన న్యాయం చేయలేనని ఉద్దేశ్యంతోనే పోటీ చేయడంలేదని చెప్పారు. అంతేకాదు.. తనకు రెండు పడవల మీద కాలు పెట్టడం నాకు ఇష్టం లేదని స్పష్టం చేశారు.

ఇక టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసు విషయంలో స్పందించిన సుమన్.. డ్రగ్స్ ఒక్క సినీ ఫీల్డ్ లోనే కాదు అన్ని చోట్ల ఉన్నాయని చెప్పారు.. ఇక వివిధ కారణాలతో అనేక మంది డ్రగ్స్ ను తీసుకుంటున్నారు.. దేశ వ్యాప్తంగా డ్రాగ్ మాఫియా లు  ఉన్నాయి.డ్రగ్స్ దందా జరుగుతూనే ఉంది.. అయితే ఒక్క సినీ పరిశ్రమకు సంబంధించినవి మాత్రమే ఎక్కువ పబ్లిసిటీ అవుతాయి. ఎందుకంటే సెలబ్రిటీలు, సినీ గ్లామర్ పై ఫోకస్ ఎక్కువగా ఉంటుందని సంచలన కామెంట్స్ చేశారు. ఇక మన దేశంలో జరిగే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డు కట్టపడాలంటే ఇతర దేశాల్లాగా మన దేశంలో కూడా కఠినమైన శిక్షలు అమలు చేయాలని సూచించారు. అప్పుడే అసాంఘిక కార్యక్ర మాలను అరికట్టగలమని అన్నారు.  మన దేశంలో అసాంఘిక కార్యకలాపాలపై కఠినమైన శిక్షలు అమలు జరగనంత వరకు ఇవి ఇలానే కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు సుమన్.  తమిళ సినిమాల్లో నటిస్తూ.. తెలుగు తెరకు పరిచమైన సుమన్   యాక్షన్ హీరోగా ఫేమస్ అయ్యారు. ఇక గంగోత్రి సినిమాతో క్యారెక్టర్ ఆర్టిసుగా , శివాజీ సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు.  2021లో ‘దాదా సాహెబ్ ఫాల్కే’ పురస్కారం అందుకున్నారు సుమన్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆరిస్టుగా వరస సినిమాలతో కెరీర్ లో బిజీగా ఉన్నారు.

Also Read: Vinayaka Chavithi: అక్కడ మండపంలో గణపతి చుట్టూ తిరుగుతూ ఎలక్షన్స్‌లో గెలిపించమని కోరుతున్న అభ్యర్థులు .. ఎక్కడంటే..

MAA Elections: జోరుగా ‘మా’ ఎన్నికల ప్రచారం.. కళాకారుల సంక్షేమం కోసం ప్రకాష్ రాజ్ వరాల జల్లు..