Maa Elections 2021: బండ్ల గణేష్ ట్వీట్‏కు రీకౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. హర్ట్ అయ్యారేమో అంటూ షాకింగ్ కామెంట్స్..

మా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల మధ్య వైరం ముదురుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ

Maa Elections 2021: బండ్ల గణేష్ ట్వీట్‏కు రీకౌంటర్ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. హర్ట్ అయ్యారేమో అంటూ షాకింగ్ కామెంట్స్..
Prakash Raj
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2021 | 9:11 PM

మా అధ్యక్ష ఎన్నికలు రోజు రోజుకీ మరింత వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల మధ్య వైరం ముదురుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవడంతో మా లో ఉన్న లొసులుగులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక ఎన్నికల తేదీ దగ్గర పడుతుండడంతో అధ్యక్ష పోటీలో ఉన్న అభ్యర్థులు సైతం ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తాజాగా పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్ ఆదివారం ఫిలింనగర్‏లోని జేఆర్సీ కన్వెన్షన్‏లో మా సభ్యులను లంచ్‏కు ఆహ్వానించారు. మా బిడ్డలు అందరం కలిసి ఇంటరాక్ట్ అవుదామని..మన విజన్ ఏంటో షేర్ చేసుకుందాం.. అన్ని విషయాలను చర్చించుకుందాం అంటూ ఇన్విటేషన్‏ను పంపారు ప్రకాష్ రాజ్. ఇక ప్రకాష్ రాజ్ ఇన్విటేషన్ పై బండ్ల గణేష్ తీవ్ర అభ్యంతరం తెలిపుతూ.. తనదైన శైలిలో స్పందించిన సంగతి తెలిసిందే.

కళాకారులను విందులు, సన్మానాల పేర్లతో ఒక దగ్గరకు చేర్చొద్దు.. కరోనా భయంతో బ్రతుకుతున్నాం.. చాలా మంది చావుదాకా వెళ్లివచ్చారు. అందులో నేను ఒకడిని.. ఓటు కావాలంటే పోన్ చేసి.. ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి.. ఇలా విందుల పేరుతో ఒకచోట చేర్చీ మా ప్రాణాలతో చెలగాటమడోద్దు అంటూ ట్వీట్స్ చేశారు బండ్ల గణేష్.. ట్వీట్..

తాజాగా బండ్ల గణేష్ ట్వీట్ పై నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. బండ్ల గణేష్ యూూటర్న్ తీసుకున్నారు. ఆయనకు ట్రాఫిక్ కష్టం వచ్చినట్టుంది. ఏం చేస్తాం. అందరినీ మెప్పించలేం కదా.. అందుకే బండ్ల హర్ట్ అయ్యారనుకుంటా.. ఆయన ఇష్టం. ఆయనకు సమాజం మీద ప్రేమ ఎక్కువగా ఉన్నట్లుంది. బండ్ల గణేష్ ప్రవర్తన అందరికి తెలిసిందే. గతంలో ఆయన అటెండ్ అయిన మీటింగ్స్‏ల గురించి మాట్లాడితే బాగుండేది. ఎన్నికలన్నాక ప్రచారం చేసుకుంటాం. అందులో తప్పేముంది. అసోసియేషన్ ఎలక్షన్స్ డిస్కస్ చేయడం, అందరితో మాట్లాడడం, క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులను విందుకు పిలిచాము. ఈరోజు చిన్న ఆర్టీస్టులు కూడా మాట్లాడారు. మేమంతా దాదాపు నాలుగు గంటలు చర్చించుకున్నాము. ఇప్పటివరకు జరిగినవి.. జరగాల్సిన వాటి గురించి అందరితో మాట్లాడము. ఆయన మాటలకు నేను షాకయ్యాను. గుజరాత్‏లో మరికొన్ని చోట్ల కూడా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా మీటింగ్స్ జరుగుతున్నాయి. మరీ దానిపై ఏమంటారు. మా సభ్యుల సమస్యలు తెలుసుకున్నాము. పరిష్కారా మార్గలపై చర్చించుకున్ననాం… ఈనెల 19న నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మ్యానిఫెస్టో ప్రకటిస్తామన్నారు ప్రకాష్ రాజ్..

Also Read: మాస్కుతో క్రేజీ ఫోజులు ఈ అమ్మడికే సొంతం.. ఈ ఫోటోస్‏లో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

RC 15: రామ్ చరణ్.. శంకర్ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్.. సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్..