Used Cars: సెకండ్ హ్యాండ్ కారుకు బ్యాంకు లోను కోసం ప్రయత్నిస్తున్నారా? ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటో తెలుసుకోండి!
కరోనా మహమ్మారిలో, ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించడం మానుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో, చాలామంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారు.
Used Cars: కరోనా మహమ్మారిలో, ప్రజలు ప్రజా రవాణాను ఉపయోగించడం మానుకుంటున్నారు. అటువంటి పరిస్థితిలో, చాలామంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని చాలా బ్యాంకులు సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయడానికి రుణాలు కూడా ఇస్తాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికి 7.25% వడ్డీ రేటుతో రుణం ఇస్తోంది. సెకండ్ హ్యాండ్ కారు కోసం ఏ బ్యాంక్ ఎంత వడ్డీ రేటుతో రుణం ఇస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
బ్యాంక్ | వడ్డీ (%) | గరిష్ట రుణం |
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.25 | వాహనం ధరలో 75% వరకు |
కెనరా బ్యాంక్ | 7.35 | వాహనం ధరలో 75% వరకు |
బ్యాంక్ ఆఫ్ ఇండియా | 7.35 | వాహనం ధరలో 70% వరకు |
పంజాబ్ నేషనల్ బ్యాంక్ | 8.30 | వాహనం ధరలో 70% వరకు |
SBI | 9.25 | వాహనం ధరలో 85% వరకు |
HDFC | 11.00 | వాహనం ధరలో 100% వరకు |
ICICI | 12.00 | వాహనం ధరలో 80% వరకు |
3 సంవత్సరాల పాటు రూ. 5 లక్షల రూపాయలతో కారు రుణం తీసుకునేందుకు ఎంత వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది?
వడ్డీ రేటు | వాయిదా (EMI) | మొత్తం వడ్డీ |
7.25 | 15,496 | 57,848 రూ. |
7.35 | 15,519 | 58,673 రూ. |
8.30 | 15,737 | 66,549 రూ. |
9.25 | 15,958 | 74,492 రూ. |
11.00 | 16,369 | 89,297 రూ. |
12.00 | 16,607 | 97,858 రూ. |
(గమనిక: ఈ లెక్కలు సుమారుగా ఉంటాయి. బ్యాంక్ వడ్డీ రేటు మీ సిబిల్ స్కోర్ అదేవిధంగా ఆదాయ వనరులతో సహా ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది.)
పాత కారును సరైన ప్రదేశం నుండి తీసుకోండి పాత కారును సెకండ్ హ్యాండ్ కార్లలో వ్యవహరించే పరిజ్ఞానం ఉన్న లేదా కార్ల కంపెనీ నుండి తీసుకోవాలి. వాడిన కారును అపరిచితుడి నుండి కొనుగోలు చేసేటప్పుడు, దాని ప్రమాద చరిత్ర, పరిస్థితి సరిగ్గా తెలియదు. ఇది భవిష్యత్తులో మీకు ఇబ్బంది కలిగించవచ్చు. కచ్చితంగా అన్ని అంశాలు పరిశీలించిన తరువాతే సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవాలి. సాధారణంగా సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే ప్రత్యెక దుకాణాదారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ, వారిది వ్యాపారం. ఏదోఒక విధంగా తమ వద్ద ఉన్న కార్లను అమ్ముకోవాలని చూస్తారు.
సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొనే తప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- కార్ల కంపెనీలకు సంబంధించిన షోరూం లలో కొద్దిగా ధర ఎక్కువైనా యూజ్డ్ కారు కొనుగోలు చేయడం మంచిది.
- ఒకవేళ బయట కొనుక్కోవడం తప్పనిసరిగా భావించినపుడు.. మీకు బాగా తెలిసిన కారు మెకానిక్ ను కూడా తీసుకువెళ్ళడం మంచిది.
- కారును అతని ద్వారా అన్నివిధాలుగా పరీక్షించిన తరువాతే, కారును ఒకే చేయాలి.
- కారుకు సంబందించిన అన్ని కాగితాలు క్షుణ్ణంగా పరిశీలించాలి.
- సాధారణంగా కారు పెయింటింగ్.. ఇంటీరియర్ ఎక్కువ పరిశీలిస్తారు. అలా కాకుండా ఇంజిన్ సైడ్ కూడా పరిశీలించాలి. ముఖ్యంగా కారు టైర్లు.. చాసిస్ ఎలా ఉంది అనేది తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి.
- బ్యాటరీ కండిషన్ కూడా చెక్ చేసుకోవడం ముఖ్యం.
ఉపయోగించిన కారు కొనడం ప్రయోజనకరంగా ఉంటుందా?
మీరు ప్రతిరోజూ కారులో ఎక్కువ ప్రయాణం చేయకపోతే.. నగరంలో లేదా చుట్టూ తిరగడానికి మీకు కారు అవసరమైతే, మీరు తక్కువ ఉపయోగించిన కారును కొనుగోలు చేయవచ్చు. ప్రతి అవసరం.. బడ్జెట్ ప్రకారం, వాడిన కార్లు మార్కెట్లో సులభంగా లభిస్తాయి. మీ అవసరాన్ని బట్టి మీరు కారును ఎంచుకోవచ్చు.