Health: మీరు రాత్రుళ్లు ఎడమవైపు తిరిగి పడుకోవడం లేదా.? అయితే దీన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే..

Health: మనం రోజంతా ఎలా ఉంటామనేదానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే కేవలం ఉదయమే కాదు రాత్రి పడుకునే విధానం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం...

Health: మీరు రాత్రుళ్లు ఎడమవైపు తిరిగి పడుకోవడం లేదా.? అయితే దీన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే..
Follow us

|

Updated on: Sep 12, 2021 | 9:42 AM

Health: మనం రోజంతా ఎలా ఉంటామనేదానిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే కేవలం ఉదయమే కాదు రాత్రి పడుకునే విధానం కూడా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని మీలో ఎందరికీ తెలుసు.? అవును.. మనం పడుకునే విధానం కూడా మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇంతకీ ఆ ప్రయోజనలేంటంటే..

* చిన్న పేగు, పెద్ద పేగుకు మధ్య ఉండే ఓ జంక్షన్‌ ఎడమ వైపు ఉంటుంది. దీనిని ఇలియోసికల్‌ వాల్వ్‌ అంటారు. ఎడమ వైపునకు దిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల చిన్నపేగులోని వ్యర్థాలు పెద్ద పేగుకు సులభంగా వెళుతుంది. దీంతో పేగు నుంచి మలం సులభంగా బయటకు వస్తుంది. ఇది మలబద్ధకాన్ని తరిమి కొడుతుంది.

* మీకు రాత్రుళ్లు గుండెలో మంటగా ఉన్న భావన కలుగుతుంటే ఎడమవైపు తిరిగి పడుకుంటే ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా గుండెకు ఎడమ భాగం ఊరిపిత్తుల నుంచి రక్తాన్ని సేకరించి దాన్ని శరీరానికి పంపుతుంది. కాబట్టి ఎడమవైపు నిద్రిస్తే.. ఇది సులభంగా జరుగుతుంది.

* శరీరంలో లివర్‌ కుడి వైపు ఉంటుంది. కాబట్టి ఎడమవైపు తిరిగి పడుకుంటే లివర్‌పై భారం తక్కువగా పడుతుంది. దీనివల్ల లివర్‌పై ఒత్తిడి తగ్గుతుంది.

* శరీరంలో ప్లీహము అనే అవయం అతి పెద్దది. ఇది ఎడమవైపు ఉంటుంది. కాబట్టి ఎడమవైపు తిరిగి పడుకుంటే దీనికి రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది.

* అసిడిటీతో బాధపడే వారు కూడా నిద్రపోయేటప్పుడు ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది. ఇలా పడుకోవడం వల్ల జీర్ణాశయంలోని పదార్థాలు , యాసిడ్ వెనక్కి వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల అసిడిటీ సమస్య రాదు.

Also Read: Weight Loss: బరువు తగ్గాలని అనుకుంటున్నారా.. అయితే చాలా ఈజీ చిట్కా.. జస్ట్ ఈ స్పెషల్ టీ తాగితే సరిపోతుంది..

Business Plan: తక్కువ బడ్జెట్‌లో వ్యాపారాన్ని ప్రారంభించండి.. ఈ ఫ్రాంచైజీతో ప్రతి నెలా లక్షలు సంపాదిచండి..

Maa Elections 2021: కలసి మాట్లాడుకుందాం.. అభిప్రాయాల్ని పంచుకుందాం.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విందు రాజకీయం..