LIC Aadhaar Shila: మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ పాలసీ.. రోజుకి రూ.29లతో నాలుగు లక్షలు పొందే అవకాశం..

LIC Aadhaar Shila: భారత జీవిత బీమా సంస్థ ప్రజల ఆర్ధిక భద్రత. భవిష్యత్ భద్రత కోసం తన వినియోగదారులకు అనేక రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దేశీయ దిగ్గజ భీమా సంస్థ అందిస్తున్న పాలసీల..

LIC Aadhaar Shila: మహిళల కోసం ఎల్ఐసీ స్పెషల్ పాలసీ.. రోజుకి రూ.29లతో నాలుగు లక్షలు పొందే అవకాశం..
Lic Aadhaar Shila Policy
Follow us

|

Updated on: Sep 12, 2021 | 8:05 PM

LIC Aadhaar Shila Plan: భారత జీవిత బీమా సంస్థ ప్రజల ఆర్ధిక భద్రత. భవిష్యత్ భద్రత కోసం తన వినియోగదారులకు అనేక రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ దేశీయ దిగ్గజ భీమా సంస్థ అందిస్తున్న పాలసీల వలన ఎన్నో లాభాలను పొందేవీలుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పిల్లల నుంచి వృద్ధులకు మాత్రమే కాదు.. మహిళలకు కూడా ప్రత్యేక ఎల్ఐసీలను అందిస్తుంది. తాజాగా మహిళల కోసం ఎల్ఐసీ ఆధార్ శిలా పేరుతో ఒక ప్రత్యేక పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాలసీకి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

 ఈ ఆధార్ శిలా పాలసీ కేవలం మహిళలకు మాత్రమే.  ఈ పాలసీ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల  టర్మ్ వరకూ ఉంటుంది. ఎవరు నచ్చిన వీలున్న టర్మ్ ను వారు ఎంచుకునే వీలుంది.  ఇక ఈ పాలసీని తీసుకున్న మహిళలు టర్మ్ మెచ్యూరిటీ అయ్యేవరకూ జీవించి ఉంటే లబ్ధిదారులకు పాలసీకి చెందిన మొత్తం డబ్బులను ఇస్తారు. ఒకవేళ అనుకోని పరిస్థితులలో  పాలసీదారులు మృతి చెందితే.. వారి కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ డబ్బులు లభిస్తాయి.

ఆధార్ శిలా పాలసీ : 

ఈ పాలసీని తీసుకోవాలనుకునే మహిళలు  8  ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య  వయసు కలిగిన వారు అర్హులు.

ఈ పాలసీ తీసుకున్నవారు తమ ప్రీమియం డబ్బులను నెలనెలా లేదా, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించే వీలుని కల్పించింది.

ఇక మొత్తం పాలసీని రూ. 75వేలకు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గరిష్టంగా రూ.3 లక్షల వరకు మొత్తానికి పాలసీ పొందొచ్చు.

25 ఏళ్ల వయసు ఉన్న యువతి ఆధార్ శిలా  పాలసీని …   రూ.3 లక్షల మొత్తానికి తీసుకుంటే… నెలకు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది.

అంటే రోజుకు రూ. 29 లను ఆదా చేస్తే.. నెలకు ప్రీమియం ఈజీగా చెల్లించవచ్చు.

ఇక పాలసీ టర్మ్ 20 ఏళ్లు… దీంతో మెచ్యూరిటీ సమయంలో రూ.4 లక్షల వరకు పొందొచ్చు.

కనుక ఈ పాలసీని మహిళలకు ఆర్ధిక భద్రత, పొదుపు వంటివి లక్ష్యంగా భారత జీవిత బీమా సంస్థ తీసుకొచ్చింది.

ఈ పాలసీ కింద పొందుతున్న ప్రయోజనాలు ప్రస్తుత చట్టాల ప్రకారం ఆదాయపు పన్ను రాయితీలకు లోబడి ఉంటాయి.

ఆధార్ శిలా పాలసీనితీసుకోవడానికి కావాల్సినవి: 

గుర్తింపు కోసం ఆధార్ కార్డు, ఓటరు కార్డు , పాస్‌పోర్ట్ చిరునామా  – ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు, రేషన్ కార్డు, ఓటరు కార్డు /లేదా పాస్‌పోర్ట్ ఆదాయపు పన్ను రిటర్నులు లేదా పే స్లిప్‌లు లతో పాటు.. హెల్త్ సర్టిఫికెట్ లను అందించాల్సి ఉంటుంది. Lic

LicAlso Read:  నా భర్తను వెంటనే ఆఫీసుకు పిలవండి.. లేకపోతే మేము డైవర్స్ తీసుకుంటామేమో అంటూ ఓ ఉద్యోగి భార్య ఆవేదన..