Ganesh Immersion: ఒకవైపు హైకోర్టు.. మరోవైపు భక్తులు. ఇద్దరి మధ్యా నలిగిపోతోన్న టీ సర్కారు

కరవమంటే కప్పకి కోపం... విడవమంటే పాముకి కోపం. అచ్చం ఇలాగే ఉంది తెలంగాణలో వినాయక నిమజ్జనం పరిస్థితి. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టరాఫ్

Ganesh Immersion: ఒకవైపు హైకోర్టు.. మరోవైపు భక్తులు. ఇద్దరి మధ్యా నలిగిపోతోన్న టీ సర్కారు
Ganesh
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 12, 2021 | 7:26 PM

Hyderabad Ganesh Immersion: కరవమంటే కప్పకి కోపం… విడవమంటే పాముకి కోపం. అచ్చం ఇలాగే ఉంది తెలంగాణలో వినాయక నిమజ్జనం పరిస్థితి. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టరాఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కుదరదంటోంది హైకోర్టు. మరి, ఎక్కడ నిమజ్జనం చేయాలో చెప్పాలంటున్నారు భక్తులు. ఒకవైపు హైకోర్టు.. మరోవైపు భక్తులు.. ఇద్దరి మధ్యా నలిగిపోతోంది ప్రభుత్వం. వినాయక నిమజ్జనంపై హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయి. హుస్సేన్ సాగర్ లో ప్లాస్టరాఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం కుదరదని హైకోర్టు తేల్చిచెప్పింది.

కెమికల్‌ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక రబ్బర్ డ్యామ్ లు, కుంటలు ఏర్పాటు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలను ఇప్పటికిప్పుడు అమలు చేయడం కష్టమనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఒక్కరోజులో చెరువుల ఏర్పాటు అసాధ్యమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పర్యావరణాన్ని కాపాడటం ప్రభుత్వం బాధ్యత. అయితే, ఈ ఏడాదికి మినహాయింపు ఇవ్వాలని హైకోర్టును కోరతామన్నారు. అయితే, నాలుగేళ్లుగా ఇవే ఆంక్షలను హైకోర్టు విధిస్తుంటే.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ప్రభుత్వం ఏ చేస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నిస్తున్నారు.

ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో హైకోర్టు చేసిన సూచనలు తెలంగాణ ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారాయ్. ఆదేశాలను అమలు చేయడం కష్టంగా మారడంతో రివ్యూ పిటిషన్ వైపే ప్రభుత్వం మొగ్గుచూపింది. అన్ని విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించాలంటూ హైకోర్టును కోరనుంది. మరి, సర్కార్ రివ్యూ పిటిషన్ పై హైకోర్టు ఎలా రియాక్టవుతుందో చూడాలి.

Read also:  KTR: సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ పై కేటీఆర్ తీవ్ర మనస్తాపం, హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలు