KTR: సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ పై కేటీఆర్ తీవ్ర మనస్తాపం, హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలు

తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు.

KTR: సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ పై కేటీఆర్ తీవ్ర మనస్తాపం, హోంమంత్రి, డీజీపీకి ఆదేశాలు
Ktr On Girl Murder
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 13, 2021 | 5:46 PM

Singareni Six Years Old Girl Muder: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న హైదరాబాద్ సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారి రేప్ అండ్ మర్డర్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల చిన్నారి లైంగిక వేధింపులు, హత్య వార్తతో తీవ్ర మనస్తాపానికి గురయ్యానన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమన్న ఆయన.. చిన్నారిపై అకృత్యానికి పాల్పడ్డ కీచకుడికి కఠిన శిక్ష పడేలా చుడాలని హోమ్ మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ డీజీపీకి కేటీఆర్ సూచించారు.

కాగా, నిన్న హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగిన సంగతి తెలిసిందే.  ఆరేళ్ల పాపపై ఓ దుర్మార్గుడు అకృత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని రేప్ చేసి చంపేశాడు. స్థానికంగా ఉండే రాజు (30) అనే ఆటో డ్రైవర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. కాగా, సింగరేణి కాలనీలో గురువారం సాయంత్రం 5 గంటల నుంచి పాప కనిపించకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల అంతా గాలించారు. రాత్రయ్యే వరకూ ఆచూకీ తెలియకపోవడంతో ఆ ఏరియాలో జులాయిగా తిరిగే రాజుపై స్థానికులకు అనుమానం వచ్చింది.

నల్గొండ జిల్లా చందంపేట్ మండలం నుంచి హైదరాబాద్ వచ్చి ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు రాజు అనే వ్యక్తి. చిల్లర దొంగతనాలు చేస్తూ ఆ ఏరియాలో జనాలతో రాజు దురుసుగా వ్యవహరిస్తూ ఉండేవాడు. దీంతో అతడు పాపను ఏమైనా చేశాడేమోనన్న అనుమానంతో అర్థరాత్రి సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ఆ చిన్నారి విగత జీవిగా పడి ఉంది. సాయంత్రం వరకూ ఆడుకుంటూ కనిపించిన తమ బిడ్డ అలా ఓ కిరాతకుడికి బలైపోవడం చూసి తల్లిదండ్రులేకాదు, స్థానికులు కూడా గుండెలవిసేలా విలపించారు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు క్లూస్ సేకరించారు. అయితే నిందితుడు రాజును తమకు అప్పగించే వరకూ పాప మృతదేహాన్ని అక్కడి నుంచి తీసేది లేదని బస్తీవాసులంతా నిరసనకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి.. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. కాగా, నిందితుడు రాజు చిల్లర దొంగతనాలు చేస్తూ మందుకు బానిసై భార్యను కొట్టి ఇంటి నుంచి గెంటేశాడని సమాచారం.

Read also: AICC: తెలంగాణ రాష్ట్రానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీని ప్రకటించిన ఏఐసీసీ.. ఎవరెవరికి..ఏయే పదవులంటే..

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
రణ్ ఉత్సవ్ - జీవితకాల అనుభూతిః ప్రధాని మోదీ
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వాట్సాప్ ఉంటే ప్రపంచం మీ చేతుల్లోనే.. సరికొత్తగా ఏఐ సేవలు లాంచ్
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
కుక్కర్‌కి మూత పెట్టమని కూతురికి తల్లి సవాల్ నాన్న కూచి ఏంచేసిందం
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
ఆ రెండు సంస్థలకూ ఆర్బీఐ షాక్.. భారీగా జరిమానా విధింపు
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
నాని న్యూ లుక్‌ అదుర్స్.. షెర్లాక్‌ హోమ్స్‌ ట్రైలర్..
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!
ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ఓటీటీ సభ్యత్వం!