Situs inversus: కుడి ఎడమైతే పొరపాటు లేదు.. కానీ శరీరంలో అవయవాలు తారుమారుగా ఉంటే..

ప్రతి వ్యక్తిలోనూ కాలేయం (లివర్) కుడివైపు ఉంటుంది. గుండె ఎడమ వైపు ఉంటుంది. కానీ.. లివర్ ఎడమ వైపున ఉంది.. గుండె కుడివైపున ఉంటె.. అది విచిత్రంగానే చెప్పాలి.

Situs inversus: కుడి ఎడమైతే పొరపాటు లేదు.. కానీ శరీరంలో అవయవాలు తారుమారుగా ఉంటే..
Situs Inversus

Situs inversus: ప్రతి వ్యక్తిలోనూ కాలేయం (లివర్) కుడివైపు ఉంటుంది. గుండె ఎడమ వైపు ఉంటుంది. కానీ.. లివర్ ఎడమ వైపున ఉంది.. గుండె కుడివైపున ఉంటె.. అది విచిత్రంగానే చెప్పాలి. ఎందుకంటే, ప్రపంచంలో అటువంటి విధంగా కుడి ఎడమైన అవయవాలు కలిగిన వారు ఇప్పటివరకూ ఐదుగురు ఉన్నారు. వారిలో నలుగురు భారత్ లోనే ఉండటం విశేషం. ఇప్పుడు మరో వ్యక్తికి ఇలా అవయవాలు అటుదిటుగా ఉన్నట్లు బయటపడింది.

అలాంటి వ్యక్తిని ఇండోర్‌లో ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యక్తిలో అంతర్గత అవయవాలు వ్యతిరేక దిశలో ఉన్నాయి. అంటే కుడివైపున ఉండాల్సినవి ఎడమవైపున.. ఎడమవైపున ఉండాల్సినవి కుడివైపున ఉన్నాయి. ఆ వ్యక్తి తన తండ్రికి కాలేయ దానం చేయడానికి సిద్ధం అయ్యారు. దానికోసం ఆ వ్యక్తికి ముందు నిర్వహించిన పరిశోధనలలో ఇది వెల్లడైంది. ఇది ప్రపంచంలో ఆరో కేసు..అలాగే, మన దేశంలో నాల్గవది. వైద్య భాషలో దీనిని సిటస్ ఇన్వర్సస్ టోటాలిస్ అంటారు. మోవ్ నివాసి ప్రదీప్ కౌశల్ (59) లివర్ సిర్రోసిస్‌తో బాధపడుతున్నారు. ఆయనకు 27 ఏళ్ల ఇంజినీర్ కుమారుడు ప్రఖర్ ఉన్నారు. తన తండ్రికి లివర్ అందించదానికి ప్రఖర్ లివర్ ఇవ్వడానికి ప్రఖర్ ముందుకు వచ్చారు. దీనికోసం ఆయనకు లివర్ మ్యాచ్ పరీక్ష జరిగింది. చోయిత్రం హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్న తర్వాత, ప్రఖర్ కాలేయం కుడివైపుకి బదులుగా ఎడమ వైపుకు ఉన్నట్లు తెలిసింది. ఈయనకు గుండెతో సహా ఇతర అవయవాలు కూడా వ్యతిరేక దిశలో ఉన్నాయి.

చిన్ననాటి నుండి, గుండె ఇతరుల్లా కాకుండా మరోవైపు ఉందని నాకు తెలుసు. నా గుండె ఎడమ వైపుకు బదులుగా కుడి వైపున ఉందని నా తల్లి చెప్పింది. కానీ కాలేయంతో సహా ఇతర అవయవాలు వ్యతిరేక దిశలో ఉన్నాయి అనే విషయం నాకు తెలీదు. అది ఇప్పుడు తెలిసింది. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అజయ్ జైన్, అతని బృందం మార్పిడి గురించి చేసిన పరీక్షల్లో ఇతని కాలేయం ఎడమవైపున ఉండనే విషయం అతనికి వివరించారు. అయితే, లివర్ ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బందీ లేదని డాకర్లు ఆయనకు స్పష్టం చేశారు. దీంతో ఆయన వద్ద నుంచి లివర్ నుంచి కొంత భాగం తీసి అతని తండ్రికి అమర్చారు.

ఈ సర్జరీ కోసం మొత్తం 22 గంటలు పట్టింది. లివర్ భాగాన్ని సేకరించడానికి 10 గంటలు..కాలేయ మార్పిడికి 12 గంటలు పట్టింది. లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ సుదేష్ శారద దాత శరీరంలోని అవయవాలన్నీ వ్యతిరేక దిశలో ఉన్నాయని చెప్పారు. అందువలన, ఆపరేషన్ చాలా క్లిష్టంగా మారింది.. అనేక పరిశోధనల తర్వాత, ఆపరేషన్ ఆగస్టు 28 న జరిగింది. దాత కాలేయాన్ని తొలగించడానికి 10 గంటలు.. రోగికి దానిని అమర్చడానికి చేయడానికి 12 గంటలు పట్టింది. ఈ అరుదైన సందర్భంలో, వైద్యులు మొత్తం 22 గంటలు తీసుకున్నారు. ఇది సాధారణ మార్పిడి కంటే ఎక్కువ సమయం తీసుకుంది. దాత 12 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యారు. ఆయన తండ్రి 17-18 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారు. ఇద్దరూ ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారని డాక్టర్ శారద వివరించారు.

సిటస్ ఇన్వర్సస్ (అవయవాలు వ్యతిరేక దిశలో ఉండటం) అంటే..

సిటస్ ఇన్వర్సస్ ( సిటస్ ట్రాన్స్‌వర్సస్ లేదా ఒపోసిటస్ అని కూడా పిలుస్తారు ) అనేది ఒక పుట్టుకతో వచ్చే పరిస్థితి. దీనిలో ప్రధాన విసెరల్ అవయవాలు వాటి సాధారణ స్థానాలకు బదులుగా వ్యతిరేక స్థానాల్లో ఉంటాయి. అంటే..కుడివైపు ఉండాల్సిన అవయవాలు ఎడమ వైపు.. ఎడమ వైపు ఉండాల్సిన అవయవాలు కుడివైపు. అంతర్గత అవయవాల సాధారణ అమరికను సిటస్ సాలిటస్ అంటారు. కార్డియాక్ సమస్యలు సర్వసాధారణంగా ఉన్నప్పటికీ, సిటస్ ఇన్వర్సస్ ఉన్న చాలా మందికి ఎలాంటి వైద్య లక్షణాలు లేదా ఈ పరిస్థితి వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. సిటస్ ఇన్వర్సస్ జనాభాలో 0.01%వ్యక్తులలో కనిపిస్తుంది. కానీ, ఇలా ఉన్నట్టు ప్రత్యేకమైన పరిస్థితులలో తప్ప బయటపడదు.

అయితే, కొందరిలో గుండె మాత్రమె ఎడమవైపునకు బదులుగా కుడివైపున ఉంటుంది. దీనిని డెక్స్ట్రోకార్డియా అంటారు.

Also Read: నల్ల గోధుమలతో ఆరోగ్యం.. ఆదాయం సంపాదించవచ్చు.. అది ఎలా సాగు చేయాలో తెలుసుకోండి

Health: మీరు రాత్రుళ్లు ఎడమవైపు తిరిగి పడుకోవడం లేదా.? అయితే దీన్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే..

Click on your DTH Provider to Add TV9 Telugu