Black Pepper Tea: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నల్ల మిరియాల టీతో ఎన్నో ప్రయోజనాలు.. ఎంటో తెలుసా..

మన భారతీయ వంటశాలలో ఉండే మసాల దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన సంగతే. కేవలం వంటలలో మాత్రమే కాకుండా.. నేరుగా

Black Pepper Tea: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి నల్ల మిరియాల టీతో ఎన్నో ప్రయోజనాలు.. ఎంటో తెలుసా..
Black Pepper
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2021 | 3:38 PM

మన భారతీయ వంటశాలలో ఉండే మసాల దినుసులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిన సంగతే. కేవలం వంటలలో మాత్రమే కాకుండా.. నేరుగా తీసుకున్నా.. లేదా వివిధ రకాలుగా తీసుకున్నా.. ఫలితాలు అనేకం ఉంటాయి. ఇలాచీలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే ఈ మసాలా దినుసులతో బరువు కూడా తగ్గొచ్చన్న విషయం తెలుసా. నల్ల మిరియాలతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టడమే కాదు.. బరువు కూడా సులభంగా తగ్గొచ్చట. నల్ల మిరియాలను ఎక్కువగా కారం, ఘాటు కోసం ఉపయోగిస్తుంటారు. నాన్ వెజ్ వంటకాలలో నల్ల మిరియాలను ఉపయోగించేది కూడా స్పైసీ కోసమే. అందుకే వీటిని కింగ్ ఆఫ్ స్పైసీ అంటారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నల్ల మిరియాలను ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తుంటారు. వీటి ప్రయోజనాల గురించి తెలుసుకుందామా.

1. నల్ల మిరియాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. 2. ఇది శరీరంలోని మంటను తగ్గిస్తాయి. అలాగే శోథ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. 3. అంతేకాకుండా.. ఇవి రక్తంలో చక్కెర స్తాయిని నియంత్రించడంలోనూ ఉపయోగపడుతుంది. 4. అలాగే కొలెస్ట్రాల్‏ను నియంత్రిస్తుంది. 5. పెయిన్ కిల్లర్‏లాగా పనిచేస్తాయి. 6. జీవక్రియను పెంచుతుంది. అలాగే కేలరీలను బర్న్ చేయడంలోనూ సహాయపడుతుంది. బరువును కూడా తగ్గిస్తుంది. 7. ఇందులో పైపెరిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో నిల్వ ఉండే కొవ్వును తగ్గిస్తుంది. 8. నల్ల మిరియాల టీ తాగడం వలన మానసిక స్థితి మెరుగుపడటమే కాకుండా.. ఒత్తిడి తగ్గుతుంది. 9. నల్ల మిరియాల టీ తాగితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. నల్ల మిరియాల టీ తయారీ విధానం.. 2 కప్పుల నీరు, 1 స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ తేనె, 1 స్పూన్ నిమ్మరసం, స్పూన్ తరిగిన అల్లం తీసుకోవాలి.. ముందుగా బాణాలిలో నీళ్లు పోసి గ్యాస్ మీద వేడిచేయాలి. నీరు వేడయ్యాక నల్ల మిరియాలు, అల్లం కలపాలి. 3 నుంచి 5 నిమిషాలు మూత పెట్టి మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఇలా నల్ల మిరియాల టీని తాగితే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Also Read: RC 15: రామ్ చరణ్.. శంకర్ సినిమాలో అదిరిపోయే మ్యూజిక్.. సాంగ్స్ పై ఇంట్రెస్టింగ్ బజ్..

Nandamuri Balakrishna: ఆ హీరోయిన్ ఫోన్​ వాల్​పేపర్​గా నటసింహం బాలయ్య ఫొటో