AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Komatireddy: కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు న‌డుం బిగించాలి: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు న‌డుం బిగించాలని భువనగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ గన్‌పార్కు వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు

Komatireddy: కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు న‌డుం బిగించాలి: ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati
Venkata Narayana
|

Updated on: Sep 12, 2021 | 3:27 PM

Share

Bhuvanagiri MP: కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు న‌డుం బిగించాలని భువనగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇవాళ గన్‌పార్కు వ‌ద్ద అమ‌ర‌వీరుల‌కు నివాళులు ఆర్పించిన అనంతరం కోమ‌టిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ సర్కారు మీద హాట్ కామెంట్స్ చేశారు. “క‌నీసం అమ‌ర‌వీరుల కుటుంబాల‌ను సైతం ప‌ట్టించుకోవ‌ట్లేదు.. కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క హామీని నేర‌వేర్చలేదు. యువ‌త‌కు విద్య, ఉద్యోగాల‌ను దూరం చేస్తున్న కేసీఆర్ తెలంగాణ‌కు ద్రోహం చేస్తున్నారు. ఎలాగైనా అందరూ సమిష్టిగా కేసీఆర్ స‌ర్కార్‌ను గ‌ద్దె దించేందుకు న‌డుం బిగించాలి” అని కోమటిరెడ్డి అన్నారు.

ఇలా ఉండగా, టీ కాంగ్రెస్ లో నేతల మధ్య సఖ్యత ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్టు కనబడ్డంలేదు. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు నేతలు రాహుల్ గాంధీతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ పటిష్ఠతకు తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి రాహుల్ గాంధీ వారికి సలహాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సందర్భంగా కొందరు నేతలు రేవంత్‌ రెడ్డిపై పరోక్షంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు.

అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడుతోందని, ఇలాంటి సమయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోకుండా అందరూ కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ ఆ నేతలకు సలహా ఇచ్చారని సమాచారం. దీంతో రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానం పూర్తిస్థాయిలో నమ్మకం పెట్టుకుందని, ఆయనపై ఇప్పట్లో ఫిర్యాదు చేస్తే తమకే ఎదురుతిరుగుతుందని ఆయా నేతలు ఒక నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.

Gun Park

Gun Park

Read also: Lokesh: బంధువులకు, పార్టీ నేత‌ల‌కు.. అధికార‌ం ఆయుధ‌ంగా, చట్టం చుట్టంగా మారింది : నారా లోకేష్