Advocates Murder: ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు.. న్యాయవాదుల హత్య కేసులో సీపీ సత్యనారాయణ
Advocates Murder: పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతులు హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. వామన్‌రావు హత్య కేసులో ఎంతటివారున్న..
Advocates Murder: పెద్దపల్లిలో సంచలనం సృష్టించిన న్యాయవాది వామన్‌రావు దంపతులు హత్య కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. వామన్‌రావు హత్య కేసులో ఎంతటివారున్న వదిలిపెట్టేది లేదని రామగుండం సీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. శనివారం ఆయన టీవీ9తో మాట్లాడుతూ.. వామన్‌రావు హత్య కేసును హైదరాబాద్‌కు చెందిన ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు వేగవంతం చేస్తోంది. పోలీసులు ఎవరికి చుట్టాలు కాదు.. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ పర్యవేక్షిస్తున్నారు. ఈ కేసులో బిట్టు శ్రీను పాత్ర ఉందని తేల్చింది మేమే. బిట్టు శ్రీను వెనుక ఎవరున్నా విచారిస్తాం. ఎవరిని కాపాడాల్సిన అవసరం మాకు లేదు. హత్యకు ముందు నిందితులకు బిట్టు శ్రీను కాల్ చేశాడు. నిందితుల ఐదు నెలల కాల్ డేటాను పరిశీలిస్తున్నాము అని సీపీ సత్యనారాయణ అన్నారు.
కాగా, ఈ కేసులో ఇప్పటికే కుంట శ్రీనివాస్‌ను-A1, చిరంజీవిని-A2, అక్కపాక కుమార్-A3 లను పోలీసులు అరెస్టు చేయగా, చేసిన విషయం తెలిసిందే. మరో కీలక నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బిట్టు శ్రీను పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు మేనల్లుడు. ఈ కేసు విచారిస్తున్న కొద్ది కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి.