AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి..తర్వాత ఏం జరిగిందంటే

చికిత్స కోసం కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లన ఓ మహిళ తానే ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆస్పత్రి ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సూపరింటిండెట్‌ మహిళకు గుండెపోటు వచ్చిందని గ్రహించి వెంటనే సీపీఆర్‌ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు.

Telangana: కుమార్తెను ఆసుపత్రికి తీసుకెళ్లి అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి..తర్వాత ఏం జరిగిందంటే
Hospital
Aravind B
|

Updated on: Apr 17, 2023 | 1:55 PM

Share

చికిత్స కోసం కుమార్తెను ఆస్పత్రికి తీసుకెళ్లన ఓ మహిళ తానే ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. ఆస్పత్రి ఆవరణలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సూపరింటిండెట్‌ మహిళకు గుండెపోటు వచ్చిందని గ్రహించి వెంటనే సీపీఆర్‌ చేసి మహిళ ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన నిర్మల్‌ జిల్లా భైంసాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే భైంసా పట్టణం ముధోల్‌కు చెందిన శోభ అనే 45 ఏళ్ల మహిళ తన కుమార్తెను చికిత్స కోసం భైంసా ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది.

ఓపీలో తమ వంతు కోసం ఎదురు చూస్తున్న శోభ ఉన్నట్టుండి ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయిన మహిళను చూసి అక్కడున్న మిగతా వారు భయంతో కేకలు వేశారు. ఏం జరిగిందా అని అక్కడికి వచ్చిన ఆస్పత్రి సూపరింటిండెంట్‌ కాశీనాథ్‌ మహిళను పరిశీలించి గుండెపోటు వచ్చినట్టు గుర్తించారు. వెంటనే ఆమెకు సీపీఆర్‌ చేశారు. దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. క్షణాల్లో స్పందించి సీపీఆర్‌ నిర్వహించి మహిళ ప్రాణాలు కాపాడిన ఆస్పత్రి సూపరింటిండెంట్‌పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం శోభ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే