Bullet Yatra: చీరకట్టులో 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేపట్టిన మహిళ.. ఎందుకో తెలుసా..?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినూత్న దీక్షకు పూనుకుంది. మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేపట్టింది. సంకల్పం మాత్రం ఒక్కటే. నరేంద్ర మోదీ మూడోవ సారి భారత ప్రధాన మంత్రి కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఊరు వాడ ఏకం చేస్తూ ఏకంగా 21 వేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తోంది.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోసం తమిళనాడుకు చెందిన ఓ మహిళ వినూత్న దీక్షకు పూనుకుంది. మదురై నుండి కురుక్షేత్రం వరకు బుల్లెట్ యాత్ర చేపట్టింది. సంకల్పం మాత్రం ఒక్కటే. నరేంద్ర మోదీ మూడోవ సారి భారత ప్రధాన మంత్రి కావడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఊరు వాడ ఏకం చేస్తూ ఏకంగా 21 వేల కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తోంది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ వేవ్.. ఇండియన్ పొలిటికల్ డిక్షనరీలో స్థిరపడిపోయిన శిలాక్షరం. 2014లో చాయ్ పే చర్చ దగ్గర మొదలైంది. 2024లో చార్‌సౌ డ్రీమ్ దాకా కొనసాగుతోంది. కేవలం రెండేరెండు ఎంపీ సీట్లతో ఢిల్లీ పీఠానికి గురిపెట్టి, ఆ గురి తప్పకుండా ఉట్టిని కొట్టిన కమలం పార్టీకి.. గెలుపును ఒక వ్యసనంగా మార్చుకోవడం అనేది అక్కడే మొదలైంది. కానీ.. మూడోసారి విక్టరీ కొట్టడాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది భారతీయ జనతా పార్టీ ఈ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ప్రజల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన రాజ్య లక్ష్మి మంద సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది.
బైక్ పై దేశ యాత్ర చేపట్టింది రాజ్య లక్ష్మీ. చీరకట్టుతో బుల్లెట్ బైక్ పై ప్రయాణించి భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేస్తూనే, ప్రధాని మోదీ ప్రధాని కావాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తాను వెళ్లే ప్రతి ప్రాంతానికి చీరకట్టులోనే వెళ్లాలని నిర్ణయించుకుంది. ఆమె చేపట్టిన ఈ బైక్ యాత్ర మదురై నుండి కురుక్షేత్రం వరకు సాగనుంది. ఈ యాత్రలో భాగంగా ఖమ్మం చేరుకున్న రాజ్య లక్ష్మికి స్థానికులు ఘన స్వాగతం పలికారు.
15 రాష్ట్రాల గుండా 21 వేల కిలోమీటర్లు బుల్లెట్ యాత్ర చేస్తున్నట్లు రాజ్యలక్ష్మి తెలిపారు. మిషన్ మోదీ – 2024 పేరుతో రాజ్యలక్ష్మి చేపట్టిన యాత్రలో తమిళనాడుతో పాటు కర్ణాటకకు చెందిన యువకులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి 400 సీట్లు రావాలని ఆమె ఆక్షాంక్షించారు. ఫిబ్రవరి 12 మధురైలో ప్రారంభమైన ఈ యాత్ర 65 రోజుల పాటు సాగుతుంది. ఈ క్రమంలోనే ఖమ్మం చేసుకున్న రాజ్య లక్ష్మీ బృందానికి ఘన స్వాగతం లభించింది.
2024 లో కూడా నరేంద్ర మోదీ ప్రధాని కావాలని ఈ యాత్ర చేస్తున్నామని రాజ్యలక్ష్మి తెలిపింది. తమిళనాడు నుండి ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చామని, ఆంధ్ర నుండి ఇప్పుడు తెలంగాణలోకి వచ్చామన్నారు. తెలంగాణలో ఎనిమిది రోజుల పాటు యాత్ర సాగుతుందన్నారు. ఆ తరువాత కర్ణాటక, గోవా, మహారాష్ట్ర మీదుగా ఢిల్లీ చేరుకుంటామన్న రాజ్య లక్ష్మి వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…