AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: పూజారి ప్రాణం తీసిన వెక్కిళ్లు.. ఎంత విషాదం, క్షణాల్లోనే జరిగిపోయింది..!

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం వెలుగు చూసింది. వెక్కిళ్లు ఓ పూజారి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వెక్కిళ్లతో పూజారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హఠాత్తు పరిణామంతో అంతా ఒక్కసారి నిశ్చేష్టులయ్యారు. అక్కడున్న వారు వెంటనే స్పందించిన ఫలితం లేకుండా పోయింది.

Hyderabad: పూజారి ప్రాణం తీసిన వెక్కిళ్లు.. ఎంత విషాదం, క్షణాల్లోనే జరిగిపోయింది..!
Took Life
Balaraju Goud
|

Updated on: Feb 21, 2024 | 5:04 PM

Share

హైదరాబాద్ మహానగరంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం వెలుగు చూసింది. వెక్కిళ్లు ఓ పూజారి నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి. ఆకస్మాత్తుగా వచ్చిన వెక్కిళ్లతో పూజారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ హఠాత్తు పరిణామంతో అంతా ఒక్కసారి నిశ్చేష్టులయ్యారు. అక్కడున్న వారు వెంటనే స్పందించిన ఫలితం లేకుండాపోయింది.

మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఈ భూమ్మీద నూకలు చెల్లాలే కానీ, ఎలాగైనా ప్రాణాలు కోల్పోతారనడానికి తాజాగా జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. అప్పటి వరకు సరదాగా.. గడిపిన వారు కూడా క్షణాల్లో లోకాన్ని విడచి వారి కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగులుస్తారు. ఇటీవల కాలంలో అటువంటి ఘటనలు అనేకం. తాజాగా హైదరాబాద్‌లో అటువంటే ఘటనే చోటు చేసుకుంది. వెక్కిళ్లతో ఓ పూజారి ఆకస్మికంగా మృతి చెందాడు.

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సునీల్ కుమార్ (33) బతుకు దెరువు కోసం హైదరాబాద్ వలస వచ్చాడు. మంగళహాట్ పరిధిలోని జింగార్ బస్తీలో సోదరి కుటుంబంతో కలిసి నివాస ఉంటున్నాడు. తన బావతో కలిసి పూజలు చేస్తూ పూజారిగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఫిబ్రవరి 19 సాయంత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా వెక్కిళ్లు వచ్చాయి. ఎంతకి వెక్కిళ్లు ఆగకపోవటంతో నీరు త్రాగాడు. అయినా ఫలితం లేకపోగా.. కాసేపటికే అతడు స్పృహతప్పి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబం సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఇంటి పెద్ద కోల్పోయి భోరున విలపిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
పేపర్ లీక్‌లపై కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్..!
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి