AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏంటీ ఈ దారుణం..బీమా డబ్బుల కోసం కన్న తండ్రనే హత్య చేసిన కొడుకు

పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను వేధించే కొడుకులు కొంతమంది ఉంటారు. అయితే బీమా డబ్బుల కోసం కన్నతండ్రినే కొడుకు హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఏంటీ ఈ దారుణం..బీమా డబ్బుల కోసం కన్న తండ్రనే హత్య చేసిన కొడుకు
Death
Aravind B
|

Updated on: Mar 29, 2023 | 7:06 PM

Share

పెన్షన్ డబ్బులు ఇవ్వాలంటూ తల్లిదండ్రులను వేధించే కొడుకులు కొంతమంది ఉంటారు. అయితే బీమా డబ్బుల కోసం కన్నతండ్రినే కొడుకు హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే బొంరాస్ పేట మండలంలోని బిక్యానాయక్ తండాకు చెందిన రాథోడ్ ధన్ సింగ్ (68) కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు తాండూరులో ఉంటున్నాడు. మరో ఇద్దరు కుమారులైన రవినాయక్, శ్రీనివాస్ నాయక్ తండ్రితోనే తండాలో నివసిస్తు్న్నారు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాస్ నాయక్ తండ్రి పేరుతో ఓ ప్రైవేటు బీమా సంస్థలో రూ.50 లక్షలు ప్రమాదం బీమా చేయించారు. అలాగే నామినీగా తన పేరు నమోదు చేసుకున్నాడు.

అయితే గత రెండు మూడు రోజులుగా తనకు డబ్బులు అవసరం ఉన్నాయని తండ్రిని శ్రీనివాస్ నాయక్ అడుగుతూనే ఉన్నాడు. తన దగ్గర లేవని ఆయన చెప్పడంతో శ్రీనివాస్ నాయక్ తన దుర్బుద్ధిని చూపించాడు. తాండూరులో ఉన్న అన్న దగ్గరకు వెళ్దామని అతని వద్ద డబ్బు ఇప్పించమని కోరాడు. దీనికి తండ్రి ఒప్పుకోవడంతో మంగళవారం నాడు తెల్లవారుజామున శ్రీనివాస్ నాయక్ ఆయన్ని బైక్ పై తీసుకెళ్లాడు. కొడంగల్ మండలం ఉడిమేశ్వరం శివారులో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో తండ్రి చనిపోయాడని శ్రీనివాస్ తండాకు వచ్చి అందరిని నమ్మించే ప్రయత్నం చేశాడు.అయితే బీమా చేయించిన డబ్బుల కోసమే అతడు తండ్రిని రాయితో కొట్టి చంపాడని రెండో కొడుకు రవినాయక్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

ఇవి కూడా చదవండి
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!