Telangana: ఇంటి పన్ను చెల్లించిన వారికి బంపరాఫర్‌ ప్రకటించిన గ్రామ సర్పంచ్‌.. భలే ఐడియా గురూ..

Telangana: సమయానికి పన్నులు రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల చెల్లింపులో అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో కొన్ని గ్రామాల్లో..

Telangana: ఇంటి పన్ను చెల్లించిన వారికి బంపరాఫర్‌ ప్రకటించిన గ్రామ సర్పంచ్‌.. భలే ఐడియా గురూ..
Telangana Villeges
Follow us

|

Updated on: Dec 08, 2021 | 11:03 AM

Telangana: సమయానికి పన్నులు రాకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పన్నుల చెల్లింపులో అలసత్వం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. దీంతో కొన్ని గ్రామాల్లో పన్నుల బకాయిలు కొండలా పేరుకుపోతుంటాయి. దీంతో సహజంగానే పన్నుల వసూళ్లు చేయాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై అధికారుల ఒత్తిళ్లు పెరుగుతాయి. తాజాగా ఇలాంటి పరిస్థితే యాద్రాది జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం సర్పంచ్‌కు కూడా ఎదురైంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.76లక్షలు వసూలు కావాల్సి ఉండగా, ఇప్పటి వరకు రూ.70వేలు మాత్రమే వసూలయ్యాయి. దీనికి తోడు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.33వేలు బకాయిలు ఉన్నాయి. దీంతో వీరిపై ఒత్తిడి పెరిగింది. ఎంత ప్రయత్నించినా పన్నులు వసూలు కాకపోవడంతో గ్రామ సర్పంచ్‌ ఎలుగు శోభసోమయ్య వినూత్నంగా ఆలోచించారు.

Villege Telangana

పన్నుల వసూళ్లు పెంచే క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు 2022 జనవరి 25లోగా చెల్లించిన వారికి బహుమతులు ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామాల్లో కొన్ని పోస్టర్లు అంటించారు. గడువులోపు పన్నులు చెల్లించిన వారిలో ముగ్గురిని లక్కీడిప్‌ ద్వారా ఎంపికచేసి మూడు బహుమతులు ఇస్తామని ప్రకటించారు. గ్రామ పంచాయతీ నుంచి బహుమతులు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ సర్పంచ్‌ ప్రథమ బహుమతిగా రూ.5వేల విలువైన ఎయిర్‌కూలర్‌, ద్వితీయ బహుమతిగా రూ. 3వేల విలువైన స్టాండ్‌ఫ్యాన్‌, తృతీయ బహుమతిగా రూ.2వేల విలువైన రైస్‌కుక్కర్‌ తన సొంత ఖర్చులతో ఇవ్వాలని నిర్ణయించారు.

2022 జనవరి 25వ తేదీలోపు ఇంటి పన్ను చెల్లించిన వారి జాబితాను తయారుచేసి, గణతంత్ర దినోత్సవం (జనవరి 26న) రోజున డ్రా తీసి విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని సర్పంచ్‌ తెలిపారు. ఈ మేరకు ప్లెక్సీలను గ్రామంలోని పలు చోట్ల ఏర్పాటు చేశారు.

రేవన్‌ రెడ్డి, టీవీ9 తెలుగు, నల్లగొండ.

Also Read: IISC Recruitment: డిగ్రీతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

IPL 2022 Mega Auction: యువ ఆటగాళ్లకు ఇదే చివరి అవకాశం.. సత్తా చాటితే కోటీశ్వరులే.. నేటి నుంచే విజయ్ హజారే ట్రోఫీ..!

Payal Rajput: పాయల్ రాజ్‏పుత్‏ను దారుణంగా ట్రోల్ చేసిన నెటిజన్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..

వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్
పెళ్లినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్