Telangana: సిద్ధిపేటలో బయపటడ్డ భారీ స్కామ్.. స్కీమ్ పేరుతో జనానికి శఠగోపం..

ఏపీలో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మోసం ఇలాగుంటే, తెలంగాణలో మరో ఫ్రాడ్‌ బయటపడింది. స్కీమ్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టింది. ఆ స్కామ్‌ ఏంటో? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం..

Telangana: సిద్ధిపేటలో బయపటడ్డ భారీ స్కామ్.. స్కీమ్ పేరుతో జనానికి శఠగోపం..
Money
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 22, 2022 | 6:05 AM

ఏపీలో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ మోసం ఇలాగుంటే, తెలంగాణలో మరో ఫ్రాడ్‌ బయటపడింది. స్కీమ్‌ పేరుతో కోట్లు కొల్లగొట్టింది. ఆ స్కామ్‌ ఏంటో? ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.. సిద్దిపేటలో భారీ స్కామ్‌ బయటపడింది. స్కీమ్‌ పేరుతో జనానికి శఠగోపం పెట్టిందో కంపెనీ. ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలుచేసి చేతులెత్తేసింది. ట్వంటీ ఫైవ్‌ మంత్స్‌, ఒక్కో గ్రూప్‌లో 6వందల మంది, నెలకు కేవలం మూడు వేలు.. రిటర్న్స్‌ మాత్రం లక్షల్లో అంటూ నమ్మించి మోసంచేసింది ప్రత్యూష డెవలపర్స్‌ కంపెనీ.

అయితే, స్కీమ్‌ గడువు ముగిసినా తిరిగి డబ్బు చెల్లించకపోవడంతో సంస్థ ఆఫీస్‌ను ముట్టడించారు బాధితులు. తమ డబ్బు తమకు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర వసూలు చేసిందంటున్నారు బాధితులు. వందలాది మంది నుంచి 25 నెలలపాటు మూడువేల రూపాయల చొప్పున కట్టించుకుని ఇప్పుడు చేతులెత్తేసిందంటూ వాపోతున్నారు.

స్కీమ్‌ గడువు దాటినా డబ్బు చెల్లించకపోవడంతో అనుమానమొచ్చి ఆఫీస్‌కి వచ్చామని చెబుతున్నారు. బాధితుల ఆందోళనతో ప్రత్యూష డెవలపర్స్‌ కార్యాలయంలో ఉద్రిక్తత ఏర్పడింది. వెంటనే తమ డబ్బు చెల్లించాలంటూ కంపెనీ ఉద్యోగులతో గొడవకు దిగారు. కంపెనీ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..