అక్కడ జవాన్.. ఇక్కడ కిసాన్.. వేటగాళ్ల వలలో ఒకేరోజు ఇద్దరు బలి..

| Edited By: Srikar T

Feb 12, 2024 | 12:22 PM

అటవీ జంతువుల వేట అమాయకుల ప్రాణాలు మింగేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఓ చోట గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బలి కాగా.. మరోచోట యువరైతు వేట గాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

అక్కడ జవాన్.. ఇక్కడ కిసాన్.. వేటగాళ్ల వలలో ఒకేరోజు ఇద్దరు బలి..
Former Dies
Follow us on

అటవీ జంతువుల వేట అమాయకుల ప్రాణాలు మింగేస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకేరోజు జరిగిన రెండు వేరువేరు ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు విడిచారు. ఓ చోట గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ బలి కాగా.. మరోచోట యువరైతు వేట గాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఘటన మరువకముందే.. ములుగు జిల్లాలో మరో విషాదం చోటు చేసుకుంది. గోవిందరావుపేట మండలానికి చెందిన పిండి రమేష్ అనే యువరైతు స్మగ్లర్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రాణాలు కోల్పోయారు. దుంపల్లిగూడెం గ్రామానికి చెందిన పిండి రమేష్ గ్రామ శివారులోని అడవికి వెళుతుండగా మార్గమధ్యలో స్మగ్లర్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి షాక్‎కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నిన్నరాత్రి జరిగింది. తెల్లవారుజామున గ్రామస్తులు అతని డెడ్ బాడీని గుర్తించారు. మృతుడు రమేష్‎కు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. కుటుంబమంతా ఇతని పైనే ఆధారపడి ఉంది. ఈ యువరైతు మృతితో ఆ గ్రామంలో ఊహించని విషాద ఛాయలు అమ్ముకున్నాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేటగాళ్లను ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టవద్దని అటవీశాఖ సిబ్బందిని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..