AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఇంతకీ ఎవరీ అభిషేక్‌ సింగ్..?

ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఇన్వాల్వెమెంట్‌ ఉన్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్‌ను పోలీసుల సహాయంతో శనివారం (మార్చి 21) సీజ్‌ చేశారు. మరిప్పుడు ఫామ్‌హౌజ్ పరిసరాలు ఎలా ఉన్నాయి..? ఫామ్‌హౌస్ ప్రిమిసిస్‌ను కూడా సీజ్ చేసిన పోలీసులు ఏం గుర్తించారు..? ఆఫ్టర్‌ సీజ్‌ ఫామ్‌హౌస్‌ ఎలా ఉంది.? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

Hyderabad: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఇంతకీ ఎవరీ అభిషేక్‌ సింగ్..?
Moinabad Drugs Case
Balaraju Goud
|

Updated on: Mar 21, 2026 | 4:34 PM

Share

ఒక సిట్టింగ్ ఎంపీ, ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఇన్వాల్వెమెంట్‌ ఉన్న మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫామ్‌హౌస్‌ను పోలీసుల సహాయంతో శనివారం (మార్చి 21) సీజ్‌ చేశారు. మరిప్పుడు ఫామ్‌హౌజ్ పరిసరాలు ఎలా ఉన్నాయి..? ఫామ్‌హౌస్ ప్రిమిసిస్‌ను కూడా సీజ్ చేసిన పోలీసులు ఏం గుర్తించారు..? ఆఫ్టర్‌ సీజ్‌ ఫామ్‌హౌస్‌ ఎలా ఉంది.? అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

మొయినాబాద్ ఫౌమ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరిగింది ఈ స్విమ్మింగ్ ఫూల్‌ పక్కన సిట్టింగ్ ఏరియా కావడంతో.. ఏ ఒక్క క్లూ మిస్ అవ్వకుండా డైనింగ్ మొత్తాన్ని పట్టాలతో కప్పేశారు పోలీసులు. చుట్టుపక్కల గార్డెన్‌లోనూ కొన్ని మెడిసిన్స్ దొరకడంతో.. అక్కడా మొత్తం కప్పేశారు. ఫామ్‌హౌస్‌లో ఉన్న మూడు కార్లను కూడా సీజ్‌ చేశారు. ఈ వెహికిల్స్‌ ఎవరిని.. ఎవరి పేరుతో రిజిస్టర్ అయ్యాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఫామ్‌హౌస్ ప్రిమిసిస్‌ను సీజ్‌ చేసిన అధికారులు మరోసారి రెవెన్యూ అధికారులకు ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారు. ఫామ్‌హౌస్ కట్టిన ప్రాంతం అసైన్డ్‌ లాండ్‌గా ఇప్పటికే రెవెన్యూ శాఖ గుర్తించడంతో.. తదుపరి చర్యలు తీసుకోవాలని మొయినాబాద్ పోలీసులు మరోసారి రెవెన్యూ శాఖకు లెటర్ రాశారు.

వివాదాలకు సెంట్రిక్‌గా మారిన ఫామ్‌హౌస్‌ కేసులో ఇవాళ మరికొన్ని కీలక విషయాలు వెల్లడించారు అధికారులు. ప్రత్యేక బృందం అదుపులో ఉన్న ఇంజినీర్ అభిషేక్‌ సింగ్‌ను విచారించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. రోహిత్‌ రెడ్డి పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసినట్టు తేల్చారు. అభిషేక్‌.. రోహిత్‌కు 24 సార్లు డ్రగ్స్ సరఫరా చేసినట్టు వెల్లడించారు. అతడి ఫోన్‌ డేటాను పరిశీలిస్తున్నారు. మొత్తంగా… డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచింది సిట్. నిందితుల కస్టడీ కోసం చెమటోడుస్తోంది. కాల్పుల ఘటనకు వెనుక ఏం జరిగింది..? ఎవరి ప్రమేయంతో పోలీసులపై హత్యాయత్నం జరిగింది..? మిస్టరీ మొత్తాన్ని ఛేదించే తీరతామని పోలీసులు పట్టుదల మీదున్నారు. ఇక నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు సోమవారం రానుంది.

ఇంతకీ ఎవరీ అభిషేక్‌ సింగ్..?

పేరుకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి… చేసేది డ్రగ్స్ సప్లై…! అటు లక్షల్లో జీతం.. ఇటు ఎక్స్‌ట్రా ఇన్‌కం..! మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ అభిషేక్‌ సింగ్ చరిత్ర తవ్వుతున్నారు సిట్ అధికారులు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నాడు…? ఎవరెవరికి అమ్ముతున్నాడు…? రోహిత్‌ రెడ్డి లాంటి ఇంకెంతమంది అతని కస్టమర్స్‌గా ఉన్నారు…? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. సెల్‌ఫోన్‌ను ఇప్పటికే సీజ్‌ చేసిన అధికారులు… అందులోని డేటాను విశ్లేషిస్తున్నారు.

గతవారం మొయినాబాద్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీకి అభిషేక్‌ సింగే సప్లయర్‌. హైదరాబాద్ ORR దగ్గర అభిషేక్‌ సింగ్.. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి డ్రైవర్‌ శరత్‌కు డ్రగ్స్ ఇచ్చి పంపించాడు. ఇలా ఒక్కసారి కాదు.. సుమారు 25 సార్లు రోహిత్‌కు అభిషేక్ సింగ్ డ్రగ్స్ పంపించినట్టు అధికారులు గుర్తించారు. నిందితుల్లో ఒక్కరైన కౌశిక్‌ రవి ఇచ్చిన సమాచారంతో నాలుగు బృందాలుగా ఏర్పడి ఎట్టకేలకు అభిషేక్‌ను పట్టుకున్న సిట్.. ఫోన్‌ డేటా బయటకొస్తే కీలక విషయాలు బయటకొస్తాయంటోంది. మరిన్ని పొలిటికల్ లింక్స్‌ బయటకొస్తే అవకాశం ఉందంటోంది. ఇప్పుడీ డ్రగ్స్ కేసులో అభిషేక్‌ సింగ్ కీలకంగా మారాడు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us