Bayyaram: బ్యాంక్ లూఠీకి విఫలయత్నం.. సీసీ టీవీలో దొంగను చూసి షాకైన పోలీసులు
మహబూబాబాద్ జిల్లాలో ఓ బ్యాంకు లూటీకి విఫలయత్నం జరిగింది. బ్యాంకు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు ఒక్కసారిగా పోలీసులు, బ్యాంకు సిబ్బందిని పరుగులు పెట్టించారు. ఉరుకులు పరుగులు పెట్టిన పోలీసులు, బ్యాంకు సిబ్బంది ఆ దొంగను చూసి షాక్ అయ్యారు..సీసీ కెమెరాలో చోరికి యత్నించిన తీరుచూసి అవాక్కయ్యారు.. ఎవరా దొంగ..?పోలీసులు ఎందుకు ఆ దొంగను చూసి షాక్ అయ్యారు..?

మహబూబూబాద్ జిల్లా బయ్యారం SBI బ్రాంచ్ లో చోరీకి విఫలయత్నం జరిగింది..ఉదయం బ్యాంకు తాళాల గొట్టి ఉండడం, డోర్ ఓపెన్ చేసి ఉండడంతో బ్యాంకు సిబ్బంది వణికిపోయారు.. పోలీసులు ఖంగారుతో పరుగులు పెట్టారు. బ్యాంక్ లూఠీకి దోపిడీ దొంగలు ప్రయత్నించారని వారిని పట్టుకోవడం కోసం ఒకపక్క పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి.. మరోపక్క క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. పోలీసులు, బ్యాంకు సిబ్బంది, మీడియా హడావుడి.. మరోవైపు గ్రామంలో బ్యాంకులో చోరీ జరిగిందని జనంలో చర్చ… కట్ చేస్తే చోరీ కి యత్నించిన దొంగను చూసి ప్రతిఒక్కరూ అవాక్కయ్యారు..
సీసీ కెమెరాలో చోరీకి యత్నించిన దృశ్యాలు చూసి పోలీసులు, బ్యాంకు సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇదిగో.. ఏడో తరగతి చదువుతున్న ఓ బుడ్డోడే బ్యాంకు లూఠీకి యత్నించింది.. గడ్డపారతో బ్యాంకు గెట్ తాళాలు బ్రేక్ చేసిన ఈ పిల్లాడు.. అదే గడ్డపారతో బ్యాంకు డోర్ లాక్ బ్రేక్ చేశాడు. దర్జాగా బ్యాంకు లోపలికి ప్రవేశించాడు.. కానీ బ్యాడ్ లక్ ఎందులో డబ్బులు ఉంటాయి.. వాటిని ఎలా చోరీ చేయాలో తెలియక వచ్చిన దారిలోనే వెళ్లిపోయాడు..
బ్యాంక్ లో చోరీ జరిగిందని తెగ హైరానా పడ్డ పోలీసులు, బ్యాంకు సిబ్బంది ఈ బుడ్డోన్ని సీసీ కెమెరాలో చూసి షాక్ అయ్యారు.. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ బాలుణ్ణి పట్టుకున్నారు.. బాలుడు ఇదే ప్రాంతానికి 7వ తరగతి విద్యార్థిగా గుర్తించారు.. బాలుణ్ణి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..