TS ICET: తెలంగాణ ఐసెట్ ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా సింపుల్‌గా చెక్ చేసుకోండి.
తెలంగాణలో ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే గురువారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కాకతీయ వర్సిటీ వీసీ టి.రమేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకుల్లో అబ్బాయిలు నిలిచారు. మొదటి ర్యాంకులో...
తెలంగాణలో ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే గురువారం మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కాకతీయ వర్సిటీ వీసీ టి.రమేశ్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకుల్లో అబ్బాయిలు నిలిచారు. మొదటి ర్యాంకులో నూకల శరణ్‌కుమార్, రెండో ర్యాంకు సాయినవీన్, మూడో ర్యాంకులో రవితేజ నిలిచాడు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఐసెట్ 2023 పరీక్షను మే 26,27 తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సుమారు 70 వేల మందికిపైగా హాజరయ్యారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి..
* అభ్యర్థుల తొలుత అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్ చేయాలి..
* అనంతరం ఐసెట్ ఫలితాలు – 2023పై క్లిక్ చేయాలి.
* తర్వాత అందులో అడిగిన హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను అందించాలి.
* చివరిగా సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
* వెంటనే ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ప్రింట్ తీసుకోవచ్చు.
మరిన్నివిద్య, ఉద్యోగ వా ర్తల కోసం క్లిక్ చేయండి..