NMDC Recruitment: హైదరాబాద్ ఎన్‌ఎమ్‌డీసీలో ఉద్యోగాలు.. నెలకు రూ. 50 వేలు జీతం..
ఎన్‌ఎమ్‌డీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అర్హులెవరు లాంటి పూర్తి వివరాలు మీకోసం.. నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్‌ఎమ్‌డీసీలో ఉన్న మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎన్‌ఎమ్‌డీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఉన్న ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? అర్హులెవరు లాంటి పూర్తి వివరాలు మీకోసం.. నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్‌ఎమ్‌డీసీలో ఉన్న మొత్తం 42 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు ఉన్నాయి.
సివిల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, మెకానికల్ విభాగాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రైయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలకు అప్లై చేసుకునే వారు సంబంధిత సబ్జెక్ట్‌లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్‌లో పాస్ అయ్యుండాలి. అలాగే అభ్యర్థులు గేట్ 2022 అర్హతను సాధించి ఉండాలి. ఈ ఖాళీలకు అప్లై చేసుకునే క్యాండిడేట్స్ వయసు 27 సంవత్సరాలు మించకూడదు.
అభ్యర్థులను తొలుత విద్యార్హత, గేట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50000 జీతంగా చెల్లిస్తారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..