Jobs: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షకుపైగా జీతం పొందే అవకాశం.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కొచ్చిన్‌లో ఉన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉన్న పలు ఖాళీలను చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా....
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కొచ్చిన్‌లో ఉన్న ఈ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఉన్న పలు ఖాళీలను చేయనుంది. దరఖాస్తుల స్వీకరణ గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎలా ఎంపిక చేస్తారు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో మొత్తం 30 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిన్స్, సేఫ్టీ, ఐటీ వంటి విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారి వయసు 27 ఏళ్లు మించకుండా ఉండాలి. దరఖాస్తు చేసుకునే వారు రూ. 1000 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులను తొలుత విద్యార్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ఆన్‌లైన్ టెస్ట్/గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 109342 జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 29వ తేదీన ప్రారంభమైంది. దరఖాస్తుల స్వీకరణకు గడువును జులై 20వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. దరఖాస్తు, నోటిఫికేషన్‌కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..