Telangana: పిచ్చికుక్కల స్వైరవిహారం.. దొరికిన వాళ్లను దొరికినట్టుగా మీదపడి కొరికేశాయ్.. వామ్మో..

ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేదు, తెలంగాణ అంతటా కుక్కలు దడపుట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మొదలుకొని.. జిల్లాల వరకు ఎక్కడచూసినా వీధికుక్కలు చెలరేగిపోతున్నాయ్‌. దొరికినోళ్లను దొరికినట్టు కసితీరా కొరికేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు... పిచ్చిపట్టినట్టుగా ఎటాక్‌చేసి చంపేస్తున్నాయి..

Telangana: పిచ్చికుక్కల స్వైరవిహారం.. దొరికిన వాళ్లను దొరికినట్టుగా మీదపడి కొరికేశాయ్.. వామ్మో..
Street Dogs Attack
Follow us

|

Updated on: Aug 11, 2024 | 11:58 AM

ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేదు, తెలంగాణ అంతటా కుక్కలు దడపుట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మొదలుకొని.. జిల్లాల వరకు ఎక్కడచూసినా వీధికుక్కలు చెలరేగిపోతున్నాయ్‌. దొరికినోళ్లను దొరికినట్టు కసితీరా కొరికేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు… పిచ్చిపట్టినట్టుగా ఎటాక్‌చేసి చంపేస్తున్నాయి కూడా. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులను చూస్తుంటే… అసలవి వీధి కుక్కలా.. లేక వేట మృగాలా అనే డౌట్‌ వస్తోంది. పిల్లలు పెద్దలనే తేడా లేకుండా వెంటాడి వేటాడిమరీ దాడులు చేస్తున్నాయ్‌. తాజాగా.. నిజామాబాద్‌ జిల్లా చేపూర్‌ గ్రామంలో పిచ్చెక్కినట్టు రెచ్చిపోయాయి వీధికుక్కలు. దొరికిన వాళ్లకు దొరికినట్టుగా మీదపడి కొరికేశాయి. దాంతో, ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ఆర్మూర్‌లో ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి బాధితులను తరలించారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ఏడుగురిని తీవ్రంగా కొరికినట్లు గ్రామస్థులు తెలిపారు. వేల్పుల నరసయ్య (50), కళ(30), పోసాని(60), లత (40), రాజ గంగారం (60), బట్టు లాస్య(45) పై వీధికుక్కలు దాడి చేసి గాయపరిచాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువగా ఉన్నా పంచాయతీ కార్యదర్శి కానీ.. వీడీసీ సభ్యులు గాని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంటున్నారు. ఇకనైనా కుక్కల బెడద నుండి రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..