Telangana: ప్రాణం తీసిన పరువు.. నమ్మకంగా వెంటతీసుకెళ్లి హతమార్చిన మహిళ! ఎక్కడంటే..

|

Nov 08, 2024 | 9:57 AM

కూలి పనులు చేసుకుంటూ పొట్టపోసుకునే ఇద్దరు మహిళల మధ్య అనూహ్య రీతిలో వివాదం రాజుకుంది. అది చిరిగి చిరిగి గాలివానగా మారింది. అంతో ఒక మహిళ మరో మహిలను హతమార్చాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ఊరి చివరన మహిళను చంపి గుట్టుచప్పుడు కాకుండా ఉన్నారు. కానీ.. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం బట్టబయలైంది..

Telangana: ప్రాణం తీసిన పరువు.. నమ్మకంగా వెంటతీసుకెళ్లి హతమార్చిన మహిళ! ఎక్కడంటే..
Woman Killed By Another Woman
Follow us on

నర్సాపూర్, నవంబర్‌ 8: కొద్ది రోజుల క్రితం కనబడకుండా పోయిన ఓ మహిళ అనూహ్య రీతిలో శవమై కనిపించింది. పోలీసులు ఆరా తీయగా పరువు కోసం మరో మహిళ ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. తనపై చెడు ప్రచారం చేస్తూ, తన పరువు తీస్తోందని భావించిన సదరు మహిళ మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి హత్య చేసినట్లు వెల్లడైంది. ఈ షాకింగ్‌ ఘటన మెదక్‌ జిల్లాలోని నర్సాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. నర్సాపూర్‌ సీఐ జాన్‌రెడ్డి తెలిపిన ప్రకారం

నర్సాపూర్‌ మండలం ఎల్లారెడ్డి గూడెం తండాకు చెందిన శాంతిబాయి (40), అరుణ అనే ఇద్దరు మహిళలు స్థానికంగా కూలీ పనులకు వెళ్లేవారు. ఆ సమయంలో శాంతిబాయి తన గురించి దుష్ప్రచారం చేస్తున్నట్లు అరుణ భావించింది. దీంతో ఆమెపై అరుణ కక్షగట్టింది. ఈ విషయమై మార్లు గొడవలు కూడా జరిగాయి. దీంతో శాంతిబాయిని చంపాలని అరుణ నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అరుణ కొండాపూర్‌కు చెందిన శ్రీనివాస్, వెంకటయ్యతో కలిసి కుట్ర పన్నింది. శాంతిబాయిని అంతమొందిస్తే ఆమె మెడలోని వెండి నగలు కూడా దక్కించుకోవచ్చని, తాను కూడా కొంత నగదును ఇస్తానని ఒప్పందం కుదుర్చుకుంది. పథకం ప్రకారం శాంతిబాయికి కల్లు తాగించి గుమ్మడిదల మండలం నల్లవల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లారు.

అక్కడ అరుణ రోడ్డుపై కాపలా ఉండగా శ్రీనివాస్, వెంకటయ్య శాంతిబాయి గొంతుకు చీర కొంగుతో ఉరేసి ప్రాణాలు తీశారు. దీంతో సెప్టెంబరు రెండో వారంలో మహిళ అదృశ్యమైనట్లు నర్సాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టగా నల్లవల్లి బస్టాప్‌ సమీపంలో మహిళ మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఆరా తీయడంతో మృతురాలు శాంతిబాయిగా పోలీసులు నిర్ధారించారు. ఆమె కుటుంబ సభ్యులను కూడా ఘటనా స్థలానికి తీసుకువెళ్లి ధృవీకరించారు. విచారణలో హంతకుల గుట్టు బయటపడింది. దీంతో అరుణతోపాటు ఆమెకు సహకరించిన ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. శాంతిబాయి భర్త అమృ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ జాన్‌ రెడ్డి మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.