Telangana: తెలంగాణలో స్వైన్‌ ప్లూ కలకలం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

చాలా సంవత్సరాల తర్వాత, తెలంగాణలో స్వైన్ ఫ్లూ వ్యాప్తి కలకలం రేపుతోంది. నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (IPM) నాలుగు కేసులను నిర్ధారించింది. ఈ కేసుల నిర్ధారణ నేపథ్యంలో.. రాష్ట్రంలో మరింత ప్లూ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఆరోగ్య శాఖ అధికారులు అలెర్ట్ అయ్యారు.

Telangana: తెలంగాణలో స్వైన్‌ ప్లూ కలకలం.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
Swine Flu
Follow us

|

Updated on: Sep 04, 2024 | 5:32 PM

తెలంగాణలో స్వైన్‌ ఫ్లూ వ్యాప్తి హడలెత్తిస్తోంది. మొన్న కరోనా.. నిన్న డెంగ్యూ.. ఇవాళ స్వైన్‌ ఫ్లూ. వివిధ రకాల వైరస్‌లు.. మానవాళిని వరుసగా వెంటాడుతోన్నాయి. తెలంగాణలో నాలుగు స్వైన్‌ ఫ్లూ కేసులు నమోదవడంతో కలకలం రేగుతోంది. ఎప్పుడో 2009లో అమెరికాలోని మెక్సికోలో అలజడి సృష్టించిన స్వైన్‌ ఫ్లూ.. ఆ తర్వాత.. పెద్దగా ప్రభావం చూపలేదు… ఇలాంటి పరిస్థితుల్లో.. ఇప్పుడు తెలంగాణలో ఏకంగా నాలుగు కేసులు రికార్డ్‌ అవడం గుబులు పుట్టిస్తోంది.

హైదరాబాద్‌ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ సెంటర్‌.. నాలుగు స్వైన్ ఫ్లూ కేసులను నిర్ధారించింది. మాదాపూర్‌లో 23 ఏళ్ల యువకుడికి.. టోలిచౌకిలో 69 ఏళ్ల వృద్ధుడికి.. నిజామాబాద్‌లో ఒకరికి, హైదర్‌నగర్‌లో ఒక మహిళకు స్వైన్ ఫ్లూ లక్షణాలు బయట పడడంతో నలుగురి శాంపిల్స్‌ హైదరాబాద్‌ నారాయణగూడ ఐపీఎం ల్యాబ్‌కు తరలించారు. ఆ శాంపిల్స్‌కు సంబంధించి టెస్టులు నిర్వహించగా.. నలుగురికి స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు నిర్థారణ కావడంతో కలకలం రేపింది.

ఇప్పటికే వైరల్‌ ఫీవర్లు హడలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వైరల్‌ ఫీవర్లు కంటిమీద కనుకు లేకుండా చేస్తున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. స్వైన్‌ ఫ్లూ వైరస్‌ ఎటాక్‌ చేయడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.

ఇంతకీ.. స్వైన్‌ లక్షణాలు ఎలా ఉంటాయి?.. స్వైన్‌ ఫ్లూ ఎలా వ్యాపిస్తుంది?.. స్వైన్‌ ఫ్లూ ఎటాక్‌ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. అసలు.. స్వైన్‌ ఫ్లూ వ్యాపించకుండా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవాలి?.. అన్న వివరాలు తెలుసుకుందాం..

స్వైన్‌ ఫ్లూ లక్షణాలు…..

  • స్వైన్‌ ఫ్లూ.. H1N1 ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ ద్వారా సంక్రమణ
  • సాధారణ ఫ్లూ జ్వరం మాదిరిగానే స్వైన్‌ ఫ్లూ లక్షణాలు
  • మొదట సాధారణ జ్వరం, ఆ తర్వాత లక్షణాలు తీవ్రతరం
  • ముక్కు కారడం, జ్వరం, దగ్గు, ఒళ్లు నొప్పులు, నీరసం,  దగ్గు, గొంతు నొప్పి, చలి, చెమటలు, కళ్ళు ఎర్రబడటం, బాడీ పెయిన్స్, తలనొప్పి, అలసట
  • వ్యాధి ముదిరితే..  బలహీనత, అతిసారం, కడుపునొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి
  • సీజనల్‌ వ్యాధుల ద్వారానే స్వైన్‌ ఫ్లూ వచ్చే అవకాశం
  • సరైన చికిత్స తీసుకోకుంటే ప్రాణాపాయం ఏర్పడే ఛాన్స్‌

స్వైన్‌ ఫ్లూ నియంత్రణకు తీసుకోవాల్సి జాగ్రత్తలు..

  • స్వైన్‌ ఫ్లూ ఒకరి నుంచి ఒకరికి ఈజీగా వ్యాపిస్తుంది
  • స్వైన్‌ ఫ్లూ సోకకుండా విధిగా మాస్కులు ధరించాలి
  • స్వైన్‌ ఫ్లూ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి
  • ఫ్లూ బారిన పడకుండా రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలి
  • ఆరేళ్లలోపు పిల్లలు, 80ఏళ్లు పైబడిన వృద్ధులు జాగ్రత్తగా ఉండాలి
  • రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు డాక్టర్లను సంప్రదించాలి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..