Youtube: రష్యాపై ఆంక్షలు విధించిన మరో టెక్ దిగ్గజం .. ఈసారి యూట్యూబ్ వంతు..
Youtube: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని (ukraine russia war) నిలువరించేందుకు అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు ఆంక్షాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించగా కొన్ని టెక్ దిగ్గజాలు సైతం రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే...
Youtube: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని (ukraine russia war) నిలువరించేందుకు అమెరికాతో పాటు పలు యూరప్ దేశాలు ఆంక్షాలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలు ఆర్థిక పరమైన ఆంక్షలు విధించగా కొన్ని టెక్ దిగ్గజాలు సైతం రష్యాపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఫేస్‌బుక్ (Facebook) రష్యన్ స్టేట్ మీడియా ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో టెక్ దిగ్గజం యూట్యూబ్ (Youtube) కూడా వచ్చి చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో యూట్యూబ్ పరిధిలోని రష్యన్ మీడియాకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది.
రష్యా ప్రభుత్వ పరిధిలో ఉన్న మీడియా సంస్థ రష్యా టుడే-(ఆర్టీ)తో పాటు ఇతర రష్యాకు చెందిన యూట్యూబ్ అకౌంట్‌లను సస్పెండ్ చేసినట్లు శనివారం యూట్యూబ్ అధికారిక ప్రతినిధి స్పష్టం చేశారు. పుతిన్ రష్యాపై పూర్తి స్థాయి దాడికి అనుమతి ఇచ్చి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూబ్యూట్ తెలిపింది. ఇదిలా ఉంటే రష్యాలో ఇప్పటికే యూట్యూబ్ ప్రైవసీ పాలసీ విధానాల్ని ఉల్లంఘించే వీడియోలను తొలగిస్తున్నట్లు తెలిపింది.
ఈ విషయమై యూట్యూబ్ అధికారిక ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్‌లో అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే అమలు చేసిన ఆంక్షల కారణంగా రష్యన్ ఛానల్‌తో సహా యూట్యూబ్‌లో డబ్బులు ఆర్జించే అనేక ఛానళ్లను నిషేధిస్తున్నాను’ అని తెలిపింది. మరి ఓవైపు నాటో, మరోవైపు ప్రపంచ దేశాలు రష్యా తీరును ఈ స్థాయిలో వ్యతిరేకిస్తున్న తరుణంలో పుతిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: Russia Ukraine Crisis: ప్రభుత్వ ప్రకటనను తుంగలో తొక్కిన పోలాండ్ పోలీసులు.. విద్యార్థులపై ఓవరాక్షన్