AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi Pad 5: అతి తక్కువ ధరలోనే సూపర్ ట్యాబ్లెట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..

ఈ జీయోమీ ప్యాడ్ 5 భారత మార్కెట్లో అత్యంత విలువైన ఆండ్రాయిడ్ టాబ్లెట్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఆపిల్ లో‌-రేంజ్ ఐప్యాడ్‌ల మాదిరిగా ఉంటుంది. 128జీబీ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ రూ. 25,999కి విక్రయిస్తోంది. అసలు అమ్మకపు ధర రూ. 26,999గా ఉంది. అలాగే బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి.

Xiaomi Pad 5: అతి తక్కువ ధరలోనే సూపర్ ట్యాబ్లెట్.. ఫీచర్లు తెలిస్తే కొనకుండా ఉండలేరు..
Xiaomi Pad 5
Madhu
|

Updated on: Jun 13, 2023 | 6:00 PM

Share

మీకు ట్యాబ్లెట్లలో సినిమాలు చూసే అలవాటు ఉందా? అలాగే వార్తలు చదవడానికి కూడా దానిని వినియోగిస్తారా? అయితే ఈ కథనం మీకోసమే. మీ అవసరాలకు మంచి ట్యాబ్లెట్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది. అదే జియోమీ ప్యాడ్ 5. ఇది మంచి డిస్ ప్లేతో పాటు అదిరే సౌండ్ క్లారిటీతో వస్తుంది. పైగా జియోమీ ఇప్పుడు దీనిపై భారీగా ధర తగ్గించింది. జూన్ 13న న్యూ జెన్ జియోమీ ప్యాడ్ 6ని లాంచ్ చేస్తున్న నేపథ్యంలో ఈ ప్యాడ్ 5 ధరను తగ్గించింది. 128జీబీ స్టోరేజ్‌తో బేస్ వేరియంట్ రూ. 25,999కి విక్రయిస్తోంది. అసలు అమ్మకపు ధర రూ. 26,999గా ఉంది. అలాగే 256జీబీ స్టోరేజ్ ఆప్షన్ రూ. 500 తగ్గింపుతో రూ.26,499కి విక్రయిస్తోంది. దీనికి అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లను కలిగిన కస్టమర్‌లు రూ. 2వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ ప్యాడ్ 5ని కేవలం రూ. 23,999 నుంచి 26,499కి కొనుగోలు చేయవచ్చు. ఈ జీయోమీ ప్యాడ్ 5 భారత మార్కెట్లో అత్యంత విలువైన ఆండ్రాయిడ్  ట్యాబ్లెట్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. తక్కువ  ధరలో ఉండే ఆపిల్ ఐప్యాడ్‌ల మాదిరిగా ఉంటుంది.

ఫీచర్లు ఇవి..

డిస్ ప్లే ఇలా.. జీయోమీ ప్యాడ్ 5 గొప్ప డిస్‌ప్లేతో వస్తుంది. అదనంగా, 8MP ఫ్రంట్ కెమెరాతో వీడియో కాలింగ్ చాలా బాగుంటుంది. ఈ టాబ్లెట్ 10.95-అంగుళాల WQHD+ (1,600 x 2,560 పిక్సెల్) ఎల్సీడీ డిస్‌ప్లేను 120Hz రిఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, డాల్బీ విజన్ సపోర్ట్‌తో వచ్చింది. ఇందులో అన్ని బెస్ట్ డిస్‌ప్లే ఫీచర్లు ఉన్నాయి.

సౌండ్ సిస్టమ్.. ఇక సౌండ్ సిస్టమ్ గురించి మాట్లాడితే ఈ జీయోమీ ప్యాడ్ 5 అద్భుతమైన క్వాడ్-స్పీకర్ సిస్టమ్‌తో వస్తుంది. చాలా బడ్జెట్ టాబ్లెట్‌లు క్వాడ్ ఛాంబర్‌లతో డ్యూయల్ స్పీకర్లు లేదా డ్యూయల్ స్పీకర్‌లను కలిగి ఉన్నాయి. జీయోమీ ప్యాడ్ 5 డివైజ్ మొత్తం 4 స్పీకర్‌లను కలిగి ఉంది. అద్భుతమైన బేస్‌తో ఆడియో అవుట్‌పుట్‌ను అందిస్తాయి. స్పీకర్లు డాల్బీ అట్మోస్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ప్రాసెసర్.. జీయోమీ ప్యాడ్ 5 స్నాప్‌డ్రాగన్ 860 SoCని కలిగి ఉంది. ఈ టాబ్లెట్ క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా అందిస్తుంది. జీయోమీ స్మార్ట్‌ఫోన్‌లకు భిన్నంగా ఉంటుంది.

ఇవి ఇబ్బందులు..

జీయోమీ ప్యాడ్ 5 ఇంకా స్టేబుల్ ఆండ్రాయిడ్ 13 అప్‌డేట్ అందుకోలేదు. ఆపిల్ ఐప్యాడ్ కాకుండా జీయోమీ లిమిటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్స్ అందిస్తుంది. జీయోమీ కొనుగోలుదారులు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను పొందలేరు. జీయోమీ Pad 5కి స్టైలస్ సపోర్టు ఉంది. అయినప్పటికీ, దేశంలో ఫస్ట్ జనరేషన్ జీయోమీ పెన్ అందుబాటులో లేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..